చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సక్రమమే? సెక్షన్ 17ఏ వర్తింపుపైనే సుప్రీం జడ్డీల్లో చీలిక..!
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేయడం, రిమాండ్ కు పంపడం, దీనిపై ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం దీన్ని హైకోర్టు తోసిపుచ్చడం, అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగాయి. అయితే చంద్రబాబు కేసుకు సెక్షన్ 17ఏ వర్తింపు విషయంలో మాత్రం ఇవాళ రెండుగా చీలిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మరో రెండు విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సెక్షన్ 17 వర్తింపు విషయంలో జడ్డీలు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే చంద్రబాబును అరెస్టు చేయడం, రిమాండ్ కు పంపడం విషయంలో మాత్రం ఇద్దరూ జడ్డీలు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దీంతో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సక్రమమేనని చెప్పినట్లయింది.

మరోవైపుచంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ పేర్కొన్నారు. 17 ఏ ప్రకారం చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నారు. ఆ అనుమతి ఇప్పుడైనా తీసుకోవచ్చన్నారు. ముందస్తు అనుమతికీ, రిమాండ్ కూ మాత్రం సంబంధం లేదన్నారు. అయితే సెక్షన్ 17ఏ అన్వయించే విషయంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
కానీ మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీ మాత్రం చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదన్నారు. 2017లో జరిగిన రాజ్యాంగ సవరణ ఆధారంగా చంద్రబాబు అరెస్టు, రిమాండ్ ను క్వాష్ చేయలేమంటూ పేర్కొన్నారు. పాత కేసులకు సెక్షన్ 17ను వర్తింప చేయలేమన్నారు. 17ఏ ఉద్దేశం అవినీతి పరుల్ని రక్షించడం కాదన్నారు. కాబట్టి ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications