జనసేన, బీజేపీ మంత్రి పదవులపై చంద్రబాబు క్లారిటీ..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న చంద్రబాబు మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో సహా ఎన్డీఏ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకార ముహూర్తం - వేదిక ఖరారయ్యాయి. ఇక..చంద్రబాబు తన మంత్రివర్గం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన పార్టీతో పాటుగా జనసేన, బీజేపీకి వచ్చే మంత్రుల సంఖ్య..శాఖల పైన నిర్ణయం జరిగినట్లు సమాచారం.

కూటమి విజయంతో
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ భేరీ మోగించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 88 స్థానాలు అవసరం ఉండగా.. ఎన్డీఏ కూటమి ఏకంగా 164 స్థానాలు విజయ బేరి మోగించింది. టిడిపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 135 స్థానాలు గెలుపొందింది, జనసేన 21 స్థానాల్లోనూ, వైసీపీ 11, బిజెపి 8 స్థానాల్లో విజయం సాధించారు. ఏపీలో కొత్త ప్రభుత్వంలో సీఎంతో సహా 25 మంది వరకు మంత్రి వర్గంలో స్థానం ఉంటుంది. మూడు పార్టీల్లో టీడీపీకి చంద్రబాబుతో సహా 19-20 స్థానాలు దక్కనున్నాయి. మిగిలిన రెండు పార్టీల స్థానాల పైన అంచనాలు మొదలయ్యాయి.

ChandraBabu beign Exercise on state cabinet placements and allotment of port folios

చంద్రబాబు కసరత్తు
జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో 3-4 మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది. పవన్ కేబినెట్ లో చేరుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. పవన్ చేరితో డిప్యూటీ సీఎం హోదాలో కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉంది. పవన్ చేరకపోతే.. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొణతాల రామక్రిష్ణ, బొమ్మిడి నాయకర్, వరప్రసాద్, మండలి బుద్ద్ ప్రసాద్ లో ముగ్గురు వరకు ఛాన్స్ దక్కుతుందని చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ నుంచి ఇద్దరికి కేబినెట్ లో అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.

ఎవరికి ఏ శాఖ
బీజేపీ నుంచి గెలిచిన వారిలో కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్ లో ఇద్దరికి ఛాన్స్ దక్కుతుందని సమాచారం. ఇక..శాఖల విషయంలో దేవాదాయ, వైద్య శాఖలను బీజేపీకి ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. జనసేనకు ఇచ్చే శాఖల పైన చంద్రబాబు -పవన్ చర్చల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో టీడీపీ నుంచి 135 మంది గెలిచినా..18-19 మందికి తొలి విడతలో మంత్రి పదవులు దక్కనున్నాయి. పలువురు సీనియర్లు ఈ సారి ఎన్నికల్లో గెలుపొందారు. ఇక..సామాజిక - ప్రాంతీయ సమీకరణాలు కీలకం కానున్నాయి. దీంతో..చంద్రబాబు కేబినెట్ తుది కూర్పు పై ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+