కొనసాగే హక్కు లేదు: విధ్వంసంపై జగన్‌ను డేరా బాబాతో పోల్చిన బాబు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‍ను ఆయన డేరా బాబాతో పోల్చారు.
కాకినాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‍ను ఆయన డేరా బాబాతో పోల్చారు.
రేప్ కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుతో పంజాబ్, హర్యానాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అల్లర్లలలో పలువురు మృతి చెందారు.

డేరా బాబాబాలా జగన్ రెచ్చగొడుతున్నారు
దీనిని ఉద్దేశించి చంద్రబాబు కాకినాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. హర్యానాలో డేరా బాబా ప్రజలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించారని, ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేందుకు జగన్ యత్నిస్తున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video


నన్ను తిట్టాలని చెబుతున్నారు
ముఖ్యమంత్రిని తిట్టాలని ప్రజలను జగన్ రెచ్చగొడుతున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదన్నారు. తనపై 24 కేసులు పెట్టినా తాను భయపడలేదని తెలిపారు. తానుప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.

అన్నింటా మమ్మల్ని గెలిపించండి
కాకినాడలో అన్ని స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని, తమ పార్టీకి అండగా నిలవాలని చంద్రబాబు కోరారు. ఆకాశమే హద్దుగా కాకినాడను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఓట్లు అడిగే హక్కు నా ఒక్కడికే ఉంది
డ్వాక్రా సంఘాలు తన మానసపుత్రిక అని చంద్రబాబు అన్నారు. టిడిపికి ఓట్లు వేయించమని డ్వాక్రా సంఘాలను అడిగే హక్కు తన ఒక్కడికి మాత్రమే ఉందని చెప్పారు. ఎన్ని కష్టాలున్నా అభివృద్ధిలో ముందుకు పోతున్నామన్నారు. విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని, జగన్ లాంటి వాళ్లకు రాజకీయాల్లో కొనసాగే హక్కు లేదన్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications