పవర్ స్టార్ ను ఏమో అనుకున్నా, నిజంగా పవన్ చాలా గ్రేట్, సీఎం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పల్లెలోని ప్రజల కళ్లల్లో సంతోషం చూడటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తీసుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను తాను అభినందిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పవన్ కల్యాణ్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడంతో అందరూ ఆయన్న అభినందిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని 13,326 గ్రామాల్లో మొత్తం 30 వేల పనులను రూ. 4,500 కోట్లతో చేపట్టాలా పవన్ కల్యాణ్ చర్యలు తీసుకున్నారని, ఆయన కష్టపడుతున్న తీరు చూస్తుంటే తనకే ముచ్చటేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల జనసేన అధినేతకు కితాబు ఇచ్చారు. ఐదు సంవత్సవరాల వైసీపీ పాలనలో పల్లెల్లోని ప్రజలు ఉపాధి హామీ పనులులేక ఇబ్బందులు పడ్డారని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.

Chandrababu congratulated Pawan Kalyan for the success of village festival in 13 thousand villages

పల్లెలకు మళ్లీ వెలుగులు తీసుకురావడానికి పవన్ కల్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, గ్రామాల్లోని ప్రతి ఇంటిలో సంతోషం చూడటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న పల్లె పండుగ విజయవంతం కావడం తనతో పాటు ప్రజలకు కూడా చాలా సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో రూ. 4,500 కోట్లతో పలు పనులు జరుగుతాయని, గ్రామంలోని ప్రజలకు ఉపాధి హామీ పనులు ఇస్తామని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. 13 వేలకు పైగా గ్రామాల్లో పల్లె పండుగను విజయవంతం చెయ్యాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు పదేపదే మనవి చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+