వైఎస్ ఘనత: అవినాష్ రెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: అన్నీ వైయస్ రాజశేఖర రెడ్డి చేశారని అన్నందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో గండికోట, చిత్రావతి పనులు 85 శాతం పూర్తి అయ్యాయని అవినాష్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 15 శాతం పనులు మాత్రమే చేసిందని ఆయన అన్నారు.

రాజకీయాలు వద్దని చంద్రబాబు

రాజకీయాలు వద్దని చంద్రబాబు

జన్మభూమి సభలో రాజకీయాలు మాట్లాడవద్దని చంద్రబాబు అవినాష్ రెడ్డికి సూచించారు. ఇది ప్రజా సభ అని, ఈ సభలో ఎవరు రాజకీయాలు మాట్లాడకూడదని, ఎవరి సభలు వారికుంటాయని, అక్కడ మాట్లాడుకోవాలని, ఇక్కడ గౌరంగా సమావేశం జరగాలని చంద్రబాబు అన్నారు.

గౌరవం నేర్చుకోవాలి...

గౌరవం నేర్చుకోవాలి...


ఈ ప్రాంతానికి ఇప్పుడు నీరు ఇచ్చింది తానేనని, ఈ విషయం కూడా ఇక్కడ చెప్పలేదని, గౌరవంగా ఉండడం నేర్చుకోవాలని చంద్రబాబు అవినాష్ రెడ్డితో అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వినతిపత్రం ఇవ్వాలని, పరిష్కరిస్తానని కూడా చెప్పారు.

ప్రోటోకాల్ ప్రకారం పిలిచారు..

ప్రోటోకాల్ ప్రకారం పిలిచారు..

కడప పులివెందులలో బుధవారంనాడు జరిగిన జన్మభూమి కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం అవినాష్ రెడ్డిని అధికారులు పిలిచారు. ఆయనకు తొలుత మైకు ఇవ్వకపోవడంతో అవినాష్ అనుచరులు నిరసన తెలిపారు. దీంతో అధికారులు అవినాష్‌కు మైకు ఇచ్చారు. మైకు ఇచ్చే ముందు రాజకీయాలు మాట్లాడవద్దని, కేవలం సమస్యలపైనే మాట్లాడాలని కూడా చెప్పారు.

ఇవి చంద్రబాబు చేసినవి కావు...

ఇవి చంద్రబాబు చేసినవి కావు...

ముఖ్యమంత్రి ప్రారంభించిన గండికోట, చిత్రవాతి ఎత్తిపోతల పథకం చంద్రబాబు చేసిన పనికాదని, గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించి 85 శాతం పనులు పూర్తి చేశారని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం 15 శాతం మాత్రమే పనులు చేసిందని ఆయన అన్నారు. దీంతో చంద్రబాబు జోక్యం చేసుకుని ఇక్కడ రాజకీయం మాట్లాడకూడదని అన్నారు.

హార్టీకల్చర్ హబ్‌గా

హార్టీకల్చర్ హబ్‌గా


రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌గా మారుతుందని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థికలోటు ఉన్నా రైతు రుణమాఫీ చేశామని అన్నారు. తనది ఉడుంపట్టు, అనుకున్నది సాధించి తీరుతానని చంద్రబాబు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu expressed anguish at YSR Congress MP Avinash Reddy at Pulivendula Janmabhoomi in Kadapa district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి