చంద్రబాబు కుటుంబ ఆస్తులు వర్సెస్ జగన్ కుటుంబ ఆస్తులు.. ఎవరు సంపన్నులంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న క్రమంలో అభ్యర్థులు తమ అఫిడవిట్ లలో పేర్కొన్న ఆస్తులు, అప్పులు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి? ఎవరికి ఎంత అప్పులు ఉన్నాయి? ఎవరెవరి ఫైనాన్షియల్ పొజిషన్ ఏమిటి అన్నది ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు ఫ్యామిలీ, వైఎస్ జగన్ ఫ్యామిలీ ఆస్తుల డేటా
ముఖ్యంగా నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన తన కుటుంబ ఆస్తుల లెక్కలు, నారా లోకేష్ అఫిడవిట్ లో ఇచ్చిన ఆస్తుల డేటా, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తుల లెక్కలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు ఫ్యామిలీకి ఎక్కువ ఆస్తులు
చంద్రబాబు నాయుడు, లోకేష్, వైయస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను ఒకసారి చూసినట్లయితే, ఎన్నికల సంఘానికి వీరు దాఖలు చేసిన అఫిడవిట్లను బట్టి జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు ఫ్యామిలీకి ఎక్కువ ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. జగన్ తాను, తన సతీమణి భారతి, తన ఇద్దరు కుమార్తెలకు సంబంధించిన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చారు.
ఆస్తులలో చంద్రబాబు కుటుంబానిదే పైచేయి
ఇక చంద్రబాబు విషయానికి వస్తే చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ లకు ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి చంద్రబాబు, నారా లోకేష్ లు అందించారు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆస్తులలో వైఎస్ జగన్ కుటుంబం కంటే చంద్రబాబు కుటుంబానిదే పైచేయిగా ఉంది.
చంద్రబాబు కుటుంబ ఆస్తుల మొత్తం విలువ ఇదే
చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల పేరు మీద ఉన్న ఆస్తులు 931 కోట్లు కాగా, నారా లోకేష్ కుటుంబ ఆస్తులు విలువ 542 కోట్లు. మొత్తంగా చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ 1473 కోట్లుగా ఉంది. గత ఎన్నికల సమయంతో పోలిస్తే ఇప్పుడు ఎన్నికల సమయానికి చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల విలువ 39 శాతం పెరిగాయి.
జగన్ కుటుంబ ఆస్తుల మొత్తం విలువ ఇలా
ఇక వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ఆస్తుల విషయానికి వస్తే 779.8 కోట్లు ఇందులో జగన్ పేరుతో ఉన్న ఆస్తులు 529. 87 కోట్లు కాగా, ఆయన సతీమణి భారతి పేరు మీద ఉన్న ఆస్తుల విలువ 176. 30కోట్లుగా ఉంది. ఇక ఈ ఐదేళ్ళలో జగన్ ఆస్తుల విలువ కూడా 41 శాతం పెరిగింది. ఈ లెక్కన చూసుకుంటే జగన్ కంటే చంద్రబాబు ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications