ఏపీలో మహిళలకు చంద్రబాబు శుభవార్త.. పండగ చేస్కోండి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షలో చంద్రబాబు మహిళా ఉద్యోగినుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు మహిళా ఉద్యోగులకు అవసరమైన ప్రతి చోటా వసతి గృహాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

మహిళా ఉద్యోగినులకు శుభవార్త
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్ స్థాయిలో మాత్రమే కాదు అవసరమైతే డివిజన్ స్థాయిలో కూడా వసతి గృహాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. అయితే ఇప్పటికే జిల్లా కేంద్రాలు కార్పొరేషన్ స్థాయిలో 100 వసతి గృహాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో చంద్రబాబు మహిళా ఉద్యోగినులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Chandrababu good news for women in AP with hostels for women employees and many morel

మహిళా వసతి గృహాల ఏర్పాటుకు ఆదేశం
వసతి గృహాల దగ్గరే పిల్లల సంరక్షణకు వీలుగా ప్రత్యేక కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు.
అయితే ఈ మహిళా వసతి గృహాలకు సంబంధించి మొదట ప్రభుత్వం వీటిని అద్దెకు తీసుకొని నిర్వహిస్తుంది. అనంతరం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కానీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కానీ వీటిని నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ హాస్టల్స్ పై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

అంగన్వాడీ ల ఆధునికీకరణకు చర్యలు
ఇక రాష్ట్రంలోని అంగన్వాడీల అభివృద్ధి పైన కూడా అధికారులతో సమీక్షించిన చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను ఎన్నింటిని అప్గ్రేడ్ చేయాలి అన్న దానిపైన సర్వే చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్నచోట అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. దాతల భాగస్వామ్యంతో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి నిర్వహించే 'మేము సైతం' కార్యక్రమాన్ని కూడా తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు
అంతే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో మూడు నెలల వ్యవధిలో మౌలిక వసతుల పనులను పూర్తి చేయాలని దీని కోసం కేంద్ర పథకాలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇక మహిళల కోసం రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని. రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ పునరుద్ధరించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మహిళలకు చంద్రబాబు శుభవార్త
అంగన్వాడి కేంద్రాల పునరుద్ధరణ, నిత్యవసర వస్తువుల ధరల తగ్గింపు, మహిళా ఉద్యోగినులకు వసతి గృహాలు వంటి అనేక కీలక నిర్ణయాలతో మహిళలకు చంద్రబాబు శుభవార్త చెప్పారు . మహిళా శిశు సంక్షేమ శాఖపైన నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మహిళలకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+