ట్రెండింగ్ లో చంద్రబాబు.. బాబుకిదే గోల్డెన్ ఛాన్స్, ఏపీకి ఆ బహుమానం కావాలి!!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో చంద్రబాబు పేరే వినిపిస్తుంది. ఢిల్లీ వేదికగా మరోమారు చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారు. ఎన్డీఏ కూటమి దేశంలో అధికారాన్ని దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కీలకంగా మారారు.
చంద్రబాబు పేరు ట్రెండింగ్
రాజకీయంగా 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు సేవలను ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉపయోగించుకోవాలని భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు ను ఎంపిక చేసే అవకాశాలు కూడా ఈ క్రమంలో బాగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ఎన్నికల ఫలితాల సంచలన విజయంతో ఏపీ లోనే కాదు దేశవ్యాప్తంగా చంద్రబాబు పేరు ట్రెండ్ అవుతుంది.

ఏపీని వరించిన అదృష్టం
సోషల్ మీడియాలో చంద్రబాబు పేరు మారుమోగి పోతుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు మద్దతు తప్పనిసరి అయిన వేళ చంద్రబాబు వేసే ప్రతి అడుగు పైన దేశవ్యాప్త రాజకీయ వర్గాలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏపీ కూటమికి 2024 ఎన్నికలలో పట్టం కట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం అదృష్టం వరించింది అన్న చర్చ జరుగుతోంది.
చంద్రబాబుకు ఏపీ ప్రజల రిక్వెస్ట్
కేంద్రం ఏపీ పట్ల సానుకూలంగా ఉంటుందని, ఈ అవకాశాన్ని చంద్రబాబు ఏమాత్రం మిస్ చేసుకోడని, ఏ చిన్న అవకాశం ఉన్న చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసమే ఆలోచిస్తాడు అని చంద్రబాబు అభిమానులు భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు ఒక సువర్ణ అవకాశం వచ్చిందని, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చేయవలసిన పనులను చంద్రబాబు చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు.

చంద్రబాబు సాధించాల్సినవి ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు అవకాశం దొరికిందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి దానికి జాతీయ హోదా కల్పించేలా చంద్రబాబు చూడాలని, రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో రేవతి రాజధానిగా అభివృద్ధి చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేసేలా, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావలసిన నిధుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఏపీ ప్రజలకు చంద్రబాబు ఇవ్వాల్సిన బహుమానాలివే
సోషల్ మీడియా వేదికగా దీనిపైన చర్చ జరుపుతున్నారు. చంద్రబాబు ఈ పనులన్నీ చేస్తే బాగుంటుందని.. బాబు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని చెబుతున్నారు. మిమ్మల్ని నమ్మి గెలిపించిన ఏపీ ప్రజలకు మీరు ఇవ్వవలసిన బహుమానాలు ఇవే అంటూ పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications