చంద్రబాబు డబ్బు కోసం కక్కుర్తిపడే మనిషి కాదు: నటుడు రవిబాబు

టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని, కక్ష సాధింపు చర్యలో భాగంగా చంద్రబాబు అరెస్టు జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

చంద్రబాబుకు మద్దతుగా రాజకీయ సినీ రంగాల ప్రముఖులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, దర్శకుడు రవి బాబు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. ఆయన తన వీడియో సందేశంలో చంద్రబాబు అరెస్టుపై మండిపడ్డారు. డబ్బు కోసం కక్కుర్తి పడే వ్యక్తి చంద్రబాబు కాదని రవిబాబు పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుని ఎలా అరెస్టు చేశారో తనకు అర్థం కావడం లేదని రవిబాబు పేర్కొన్నారు.

Chandrababu is not a greedy for money man: Actor Ravi Babu

అధికారం అనేది అశాశ్వతమైనదని పేర్కొన్న రవిబాబు అశాశ్వతమైన అధికారంతో చంద్రబాబును జైల్లో పెట్టిన వారు అదే అధికారాన్ని ఉపయోగించి చిటికెలో ఆయన్ని బయటకు తీసుకురావచ్చని తెలిపారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని సినిమా వాళ్ళ గ్లామర్ కానీ, రాజకీయ నాయకుల పవర్ కానీ అసలు శాశ్వతం కాదని, అలాగే చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదంటూ రవిబాబు తెలిపారు.

రామారావు గారి కుటుంబం, చంద్రబాబు గారి కుటుంబం తమ కుటుంబానికి ఎంతో ఆప్తులని తెలిపిన ఆయన చంద్రబాబు నాయుడు ఏదైనా పని చేసే ముందు 100 కోణాల్లో చూసి, దానిపై అందరిని సంప్రదించి, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటారని రవిబాబు తెలిపారు. చంద్రబాబును సరైన ఆధారాలు లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారు తనకైతే అర్థం కావడంలేదన్నారు.

ఆయనకు భూమి మీద ఇవ్వాళే చివరి రోజు అంటే కూడా 50 సంవత్సరాలకు సామాజిక అభివృద్ధి గురించి ప్లాన్లు వేస్తారని పేర్కొన్నారు.రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తుల సహజమైనవే అయినా.. 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం ఏమి ఎత్తు ఏం ఎత్తుకు పై ఎత్తు అని ప్రశ్నించారు.

చంద్రబాబును బయట ఉంచి మీ ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేయండి అని రవిబాబు పేర్కొన్నారు. ఆయన కచ్చితంగా ఈ దేశాన్ని వదిలేసి పారిపోరని స్పష్టం చేశారు . ప్రతిక్షణం ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్న ఆయన చంద్రబాబును వదిలి పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+