సంబరాలు రేపు చేసుకుందాం తమ్ముళ్ళు... మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు కీలకవ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు ధీమాతో తమదైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో మరింత ఉత్సాహం కనిపిస్తుంది. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా నేడు ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు వెళ్లడంతో ఈరోజు ఎన్టీఆర్ భవన్ లో సందడి చోటుచేసుకుంది.
సీఎం సీఎం నినాదాలతో ఎన్టీఆర్ భవన్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తొలిసారి చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. దీంతో ఆయనకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికా.రు చంద్రబాబు సీఎం కాబోతున్నారంటూ ముందస్తుగా అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కసారిగా అక్కడ సీఎం సీఎం అంటూ నినాదాలతో ఎన్టీఆర్ భవన్ మారుమోగిపోయింది.

చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులు శక్తిని అప్పుడే ఖర్చు పెట్టుకోవద్దని, సంబరాలు రేపు చేసుకుందామంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ బ్యాక్ ఆఫీసులో పనిచేసిన నేతలను చంద్రబాబు అభినందించారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టిన చంద్రబాబు నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని సైకిల్ అవసరాన్ని ఆ పోస్టులో పేర్కొన్నారు.
సైకిల్ పై చంద్రబాబు... ఆసక్తికర పోస్ట్
సైక్లింగ్ ఆరోగ్యానికి, సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్న చంద్రబాబు తను సైకిల్ తొక్కుతున్న ఫోటో ను షేర్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ గుర్తు కూడా సైకిల్ కావడంతో సైక్లింగ్ సమాజానికి వ్యక్తులకు చాలా మంచిదని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకరకంగా సైకిల్ తోనే మేలు జరుగుతుందని, ఏపీ ప్రజలకు అర్ధమయ్యేలా పోస్ట్ పెట్టారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో టీడీపీ జోష్
ఏదేమైనా ఇటీవల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాయి. ఈ క్రమం లోనే ఎన్టీఆర్ భవన్ కి వెళ్లిన చంద్రబాబును సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ, అప్పుడే సంబరాలకు తెర తీశారు తెలుగు తమ్ముళ్లు. మరి రేపు ఫలితాలు వాళ్ళ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications