అఖండ సినిమాపై చంద్రబాబు రియాక్షన్.. ఏపీ పరిస్థితులకు లింక్ పెట్టి అనూహ్య వ్యాఖ్యలు

టిడిపి హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నట వారసుడు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అఖండ సినిమా బాక్సాఫీసును బద్దలు కొట్టడంతో ఈ సినిమాపై అందరిలో ఇంట్రెస్ట్ నెలకొంది. ఊహించినదానికంటే భారీ విజయాన్ని నమోదు చేసిన అఖండ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్ గా మారింది. టాలీవుడ్ స్టాండర్డ్స్ ను మరింత పెంచింది. సినిమా పై పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కూడా ఇందుకు కారణంగా నిలిచింది.

 అఖండ సినిమాపై చంద్రబాబు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

అఖండ సినిమాపై చంద్రబాబు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

ఇక తాజాగా టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అఖండ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన బావ బాలయ్య సినిమా పై ఆసక్తి కర కామెంట్స్ చేసిన చంద్రబాబు అఖండ సినిమాను ఏపీ రాజకీయ పరిస్థితులకు లింకు పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే అఖండ సినిమాలో చూపించారని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖండ మూవీని తాను ఇటీవల చూశానని పేర్కొన్న చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్నదే ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని, సినిమా చాలా బాగుందంటూ కితాబిచ్చారు. ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఈ సినిమాలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అన్న చంద్రబాబు

ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అన్న చంద్రబాబు

సినిమా యూనిట్ కు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని పేర్కొన్న చంద్రబాబు రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని, బాలయ్య యాక్షన్ చాలా బాగుందని పేర్కొన్నారు. అంతకు ముందు అఖండ సినిమా గురించి ట్వీట్ చేసిన చంద్రబాబు అఖండ విజయం సాధించిన అఖండ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ రావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు అభినందనలు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

ఊర మాస్ హిట్ అన్న లోకేష్, చిత్ర పరిశ్రమ స్టాండర్డ్స్ పెంచారన్న బ్రాహ్మణి

ఊర మాస్ హిట్ అన్న లోకేష్, చిత్ర పరిశ్రమ స్టాండర్డ్స్ పెంచారన్న బ్రాహ్మణి


ఇక అఖండ సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ బాల మామయ్య దర్శకుడు బోయపాటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నటీనటులు ఇతర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అఖండమైన ఊర మాస్ హిట్ కొట్టారంటూ కొనియాడారు. ఎక్కడ విన్నా ఒకటే మాట జై బాలయ్య అంటూ సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ వెల్లడించారు.ఇక అఖండ సినిమాపై చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య, బాలయ్య బిడ్డ బ్రాహ్మణీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తాత గారు.. ఇప్పుడు నాన్నగారు చిత్రపరిశ్రమ స్టాండర్డ్స్ ను పెంచడంలో కీలక పాత్ర పోషించారని ఇంతకుముందు నాన్నగారి సినిమాలన్నీ ఒక ఎత్తయితే ఈ సినిమా మరో ఎత్తు అంటూ వ్యాఖ్యానించారు. అఖండ సినిమా చూశానని, చాలా అద్భుతంగా ఉందని బ్రాహ్మణి వెల్లడించారు. నిజంగా ఆ ఇంటి ఆడబిడ్డగా పుట్టినందుకు గర్వపడుతున్నాను అని బ్రాహ్మణి పేర్కొన్నారు.

 బోయపాటి బాలయ్య కాంబినేషన్ అదుర్స్ అంటున్న ప్రేక్షకులు

బోయపాటి బాలయ్య కాంబినేషన్ అదుర్స్ అంటున్న ప్రేక్షకులు

ఇదిలా ఉంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు అఖండ కూడా వాటి సరసన నిలిచినట్లు గా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను త్వరలోనే బాలీవుడ్ లో రీమేక్ చేస్తారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+