ప్రపంచ దేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్!
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2026 సదస్సులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఆర్థిక భవిష్యత్తుపై ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు. ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, మరో 2-3 ఏళ్లలో మూడో స్థానానికి, 2047 నాటికి మొదటి స్థానానికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
నిద్రిస్తున్న సింహం మేల్కొంటే..
దావోస్ సదస్సులో చంద్రబాబు నాయుడు ఇండియాను ఓ నిద్రస్తున్న సింహంతో పోల్చారు. "మనం ప్రస్తుతం దిగ్గజ దేశాలతో పోటీపడుతున్నాం. భారత్ ఓ నిద్రిస్తున్న సింహం వంటిది. ఆ సింహం కనుక ఒక్కసారి మేల్కొంటే, 2047 నాటికి మనం ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా నిలుస్తాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈసారి దావోస్ సదస్సులో ఇండియా నుంచి ముందెన్నడూ లేని విధంగా భారీ రాజకీయ ప్రాతినిధ్యం లభించింది. కేంద్ర మంత్రులతో పాటు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు పార్టీలకతీతంగా దేశ ఆర్థిక వృద్ధిని చాటిచెప్పారు. ప్రపంచంలోనే పెట్టుబడులకు ఇండియా అత్యంత సురక్షితమైన ప్రదేశమని, మన దేశం వంటి మరొకటి లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో తాము తీసుకువచ్చిన 25 కొత్త పాలసీల గురించి ఆయన వివరించారు.

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఉత్సాహం
ప్రధాని మోదీ 'యాక్ట్ ఈస్ట్' పాలసీ వల్ల అసోం వేగంగా వృద్ధి చెందుతోందని సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కేరళ తన 24 ప్రాధాన్యత రంగాలను ప్రదర్శించగా.. గుజరాత్ డిప్యూటీ సీఎం కూడా మొదటిసారి దావోస్ వచ్చి వివిధ రాష్ట్రాల కృషిని అభినందించారు.












Click it and Unblock the Notifications