మద్యం బాబులకు ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్
చంద్రబాబు సర్కార్ మందుబాబులకు బిగ్ షాకిచ్చింది.రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది.దీనిలో భాగంగానే లిక్కర్ ధరలు 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.ఏపీలో మద్యాన్ని మూడు కేటగిరీలుగా సరఫరా చేస్తున్నారు. ఇందులో ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్లుగా సరఫరా అవుతుంది.
ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో అన్ని కేటగిరీల్లో 15 శాతం ధరలు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.గతేడాది ఏపీలో నూతన మద్యం పాలసీ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.వేలం ద్వారా 3 వేలమంది మద్యం షాపుల్ని దక్కించుకున్నారు. కమీషన్ పెంచకుంటే అమ్మకాలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం చేయడంతో వారి డిమాండ్‌ను పరిశీలించిన ప్రభుతం ఈ మేరకు 20 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ మద్యం బాటిళ్ల ధర పెంపు గురించి వస్తున్న సమాచారంపై స్పష్టత ఇచ్చారు. అసలు ధర పెంపు కేవలం ₹10 మాత్రమే అని ఆయన తెలిపారు. అలాగే, బ్రాండ్ లేదా పరిమాణం (క్వార్టర్/హాఫ్/ఫుల్ బాటిల్) అనేదానితో సంబంధం లేకుండా, అన్ని బాటిళ్లపై ₹10 మాత్రమే పెరిగిందని స్పష్టం చేశారు. కొంతమంది ₹15 లేదా ₹20 పెరిగిందని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని, అది నిజం కాదని తెలిపారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని అపోహలకు గురి కాకూడదని విజ్ఞప్తి చేశారు. తాజా ధరల వివరాలను అన్ని షాపుల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. బీరు, రూ 99 మద్యం సీసాలపై ఎటువంటి పెంపు లేదన్నారు.
మరోవైపు ఏపీలో మద్యం ఏరులై పారుతుందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.కొందరు వ్యక్తులు నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లీగల్‌గా మద్యాన్ని అమ్మేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఏ మాత్రం భయం లేకుండ బహిరంగంగా మద్యం బాటిళ్లు వరుసగా పేర్చి వ్యాపారం చేస్తున్నారని, జగన్ రాష్ట్రాన్ని విద్యంధ్రప్రదేశ్‌గా మారిస్తే చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications