షారుక్‌పై చంద్రబాబు ప్రశంసలు: బాద్ షా ప్రసంగం(వీడియో)
Recommended Video

దావోస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేక అవార్డుతో షారుక్‌ను సత్కరించింది.
బాలలు, మహిళల హక్కుల కోసం షారుక్ చేస్తున్న సేవలకు గాను ఆయన్ను క్రిస్టల్ అవార్డుతో గౌరవించింది. సోమవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో షారుక్ ఈ అవార్డును స్వీకరించారు.

షారుక్‌పై ప్రశంసలు
కాగా, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు.. షారుక్‌ను ట్విట్టర్ వేదికగా అభినందించారు. సమాజానికి సేవ చేసేందుకు ఓ రాజకీయ నాయకుడో.. గొప్ప నేతో కానక్లర్లేదు.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి క్రిస్టల్ అవార్డు అందుకున్నందుకు అభినందనలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

కృషి అభినందనీయం
అంతేగాక, బాలలు, మహిళల హక్కుల కోసం మీరు(షారుక్) చేస్తున్న కృషి ప్రశంసించదగిందని చంద్రబాబు కొనియాడారు. కాగా, షారుక్ తన మీర్ ఫౌండేషన్ ద్వారా యాసిడ్ దాడి బాధితులకు సహాయ, సహకారాలు అందిస్తున్నారు. క్యాన్సర్ బాధిత చిన్నారులను కూడా ఆయన ఆదుకుంటున్నారు.

ఫ్యామిలీ నుంచే..
కాగా, అవార్డు స్వీకరించిన అనంతరం షారుక్ ఖాన్ వేదికపై మాట్లాడారు. తన తల్లి, సోదరి, భార్య, పిల్లల నుంచి తాను విలువలను నేర్చుకున్నానని చెప్పారు. మనకు తోచిన విధంగా ఇతరులకు సాయం చేయడంలో ఆనందం ఉందన్నారు.
నమస్కారం.. జైహింద్..
తన సేవలను గుర్తించి అవార్డును అందించిన దావోస్‌కు ఈ సందర్భంగా షారుక్ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం, జైహింద్ అంటూ షారుక్ తన ప్రసంగాన్ని ముగించారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications