Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chandrababu Swearing-in ceremony: నవ్యాంధ్ర రథసారథి చంద్రబాబు ప్రమాణస్వీకారం..!

Chandrababu Swearing-in ceremony:నవ్యాంధ్రలో కొత్త చరిత్ర...జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడటంతో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక కూటమిలో ప్రధాన పాత్ర పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు,కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. ఇక రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరుకానున్నారు. గన్నవరం విమానాశ్రయంకు సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ ఈ మహోత్సవానికి వేదిక కానుంది. సరిగ్గా ఉదయం 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు నాయుడుచే రాష్ట్ర గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇక చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Chandrababu Naidu to swear in as  Andhra Pradesh cheif minister get live updates in telugu

Jun 12, 2024, 2:00 pm IST
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రమాణ స్వీకార ఫొటోలను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ.
Jun 12, 2024, 1:08 pm IST
ఆంధ్రప్రదేశ్

వేదికపైనే ఉన్న రజినీకాంత్‌ను ప్రధాని మోదీకి పరిచయం చేసిన చంద్రబాబు.
Jun 12, 2024, 1:07 pm IST
ఆంధ్రప్రదేశ్

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో కలిసి సభకు అభివాదం తెలిపిన ప్రధాని మోదీ.
Jun 12, 2024, 1:06 pm IST
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులతో కలిసి గ్రూప్ ఫొటో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ.
Jun 12, 2024, 12:20 pm IST
ఆంధ్రప్రదేశ్

మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణస్వీకారం
Jun 12, 2024, 11:56 am IST
ఆంధ్రప్రదేశ్

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ.
Jun 12, 2024, 11:53 am IST
ఆంధ్రప్రదేశ్

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్.
Jun 12, 2024, 11:52 am IST
ఆంధ్రప్రదేశ్

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్.
Jun 12, 2024, 11:36 am IST
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Jun 12, 2024, 11:32 am IST
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ, పలువురు కేంద్రమంత్రులు.
Jun 12, 2024, 11:27 am IST
ఆంధ్రప్రదేశ్

ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్.
Jun 12, 2024, 11:18 am IST
ఆంధ్రప్రదేశ్

ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రజినీకాంత్, చిరంజీవి.
Jun 12, 2024, 11:13 am IST
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న హీరో సాయి ధరమ్
Jun 12, 2024, 11:09 am IST
ఆంధ్రప్రదేశ్

ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై నారా లోకేష్‌ను సాదరంగా ఆహ్వానించిన టీడీపీ సీనియర్ నేతలు.
Jun 12, 2024, 11:07 am IST
ఆంధ్రప్రదేశ్

ప్రమాణ స్వీకార వేదికపై కేంద్రమంత్రులు చిరాగ్ పాశ్వాన్, కింజరాపు రామ్మోహన్ నాయుడితో టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ముచ్చట్లు.
Jun 12, 2024, 11:06 am IST
ఆంధ్రప్రదేశ్

ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు చేరుకున్న నారా లోకేష్. మంత్రివర్గంలో ఆయనకు చోటు లభించింది. మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
Jun 12, 2024, 11:04 am IST
ఆంధ్రప్రదేశ్

ప్రమాణ స్వీకార వేదికపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ముచ్చట్లు.
Jun 12, 2024, 11:02 am IST
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి.
Jun 12, 2024, 11:01 am IST
ఆంధ్రప్రదేశ్

Akira
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి బస్సులో కేసరాపల్లి ఐటీ పార్క్‌కు చేరుకున్న కుమారుడు అకీరా నందన్.
Jun 12, 2024, 11:00 am IST
ఆంధ్రప్రదేశ్

Nagababu
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి బస్సులో కేసరాపల్లి ఐటీ పార్క్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు.
Jun 12, 2024, 10:47 am IST
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న ఎన్సీపీ చీలికవర్గం నాయకుడు ప్రఫుల్ పటేల్. చంద్రబాబును డైనమిక్ లీడర్‌గా అభివర్ణన.
Jun 12, 2024, 10:39 am IST
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానితులతో కిటకిటలాడుతున్న సభా ప్రాంగణం.
Jun 12, 2024, 10:36 am IST
ఆంధ్రప్రదేశ్

గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వయంగా స్వాగతం పలకనున్న చంద్రబాబు. కొద్దిసేపటి కిందటే చంద్రబాబు విమానాశ్రయానికి చేరుకున్నారు.
Jun 12, 2024, 10:05 am IST
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్న ప్రధాని మోదీ. ఈ ఉదయం 10:40 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
Jun 12, 2024, 9:58 am IST
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమలకు వెళ్లనున్న చంద్రబాబు. ఈ సాయంత్రం తిరుమలకు బయలుదేరి వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొంటారు.
Jun 12, 2024, 9:53 am IST
ఆంధ్రప్రదేశ్

కేసరపల్లి ఐటీ పార్క్ వద్దకు వెళ్లే మార్గాల్లో భారీగా వాహనాల రాకపోకలు స్తంభించాయి.
Jun 12, 2024, 8:48 am IST
ఆంధ్రప్రదేశ్

గన్నవరం కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికకు భారీ సంఖ్యలో చేరుకుంటోన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు.
Jun 12, 2024, 8:33 am IST
ఆంధ్రప్రదేశ్

టీడీపీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, నిమ్మకాయల చినరాజప్ప వంటి సీనియర్లకు మంత్రిపదవులు లభించలేదు.
Jun 12, 2024, 7:51 am IST
ఆంధ్రప్రదేశ్

JP Nadda
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.
Jun 12, 2024, 7:44 am IST
ఆంధ్రప్రదేశ్

Amit Shah
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+