నిర్భయ ఘటనతో జగన్ కేసుకు బాబు పోలిక, టిజి ఫైర్

నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్షను సమర్థిస్తున్న మీడియా జగన్ అవినీతి పైన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జగన్ అవినీతి దాదాపు నిర్భయ అత్యాచారం వంటిదే అన్నారు. అలాంటప్పుడు ఆయన అవినీతిపై ఎందుకు పోరాడటం లేదన్నారు. దేశంలో కాంగ్రెసు అడ్రస్ గల్లంతు చేస్తామన్నారు. ఆ పార్టీ దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందన్నారు.
అల్లర్లకు ప్లాన్: టిజి వెంకటేష్
నిమజ్జనాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని చూస్తోందని, మంత్రి టిజి వెంకటేష్ వేరుగా అన్నారు. ఆయన హైదరాబాదులో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిమజ్జనం సమయంలో ఫ్యాక్షన్ తరహా అల్లర్లు సృష్టించి దానిని ఉద్యమంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
టిజి మీద దాడిపై కొండ్రు
మంత్రి టిజి వెంకటేష్ పైన ఆదివారం కర్నూలులో జరిగిన దాడిని మంత్రి కొండ్రు మురళి ఖండించారు. ఇలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎపిఎన్జీవోల పేరుతో అతి చేస్తే సహించేది లేదన్నారు. సమైక్య ఉద్యమంలో ముందున్న టిజి పైన దాడులు సరికాదని, సమైక్య ముసుగులో ఎవరు దాడి చేసినా ఊరుకునేది లేదన్నారు.












Click it and Unblock the Notifications