జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై చంద్రబాబు సానుకూలత ? .. టీడీపీ వర్గాల్లో చర్చ

ఏపీలో జరిగిన గత ఎన్నికల షాక్ నుండి టీడీపీ కోలుకోలేకపోతుంది. టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఓటమిని చవిచూసింది. దీంతో పార్టీని నడిపే సమర్ధవంతమైన నాయకుడు , చంద్రబాబుకు బాసటగా నిలిచే వారు ఎవరు అన్న చర్చ జోరుగా పార్టీ వర్గాల్లో సాగుతుంది. గత ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు స్థానాలకే టిడిపి పరిమితం కావడంతో టీడీపీ దుకాణం బంద్ అయిందని పెద్ద ఎత్తున ప్రచారం సైతం జరిగింది. చంద్రబాబుకు వయసు మీద పడింది అని పార్టీని నడిపే యువ రక్తం కావాలని అందుకు జూనియర్ ఎన్టీఆర్ సరైనోడు అని ప్రచారం జరిగింది . నేటికీ ప్రచారం జరుగుతూనే ఉంది.

 జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్న తెలుగు తమ్ముళ్ళు

జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్న తెలుగు తమ్ముళ్ళు

ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ చంద్రబాబు టార్గెట్ గా పలు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. టిడిపిని నామరూపాలు లేకుండా చేయాలని, చంద్రబాబు పాలన చేసిన రోజుల నాటి అవినీతిని బయట పెట్టాలని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఫోకస్ మొత్తం చంద్రబాబు మీదే పెట్టారు జగన్ మోహన్ రెడ్డి . దీంతో పార్టీ పరిస్థితి డోలాయమానంగా తయారైంది. ప్రజలందరికి మరియు టీడీపీ నేతలందరికీ కూడా టీడీపీ పై నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ రాకను చాలా మంది తెలుగు తమ్ముళ్ళు కాంక్షిస్తున్నారు.

ఎన్టీఆర్ విషయాన్ని చంద్రబాబుతో చర్చించిన సీనియర్ నాయకులు

ఎన్టీఆర్ విషయాన్ని చంద్రబాబుతో చర్చించిన సీనియర్ నాయకులు

టీడీపీపై నేతల విముఖత పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుంది అని ఒక టాక్ నడుస్తుంది. ఇక ఏపీలో టీడీపీ కి పూర్వ వైభవం తేడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ ఎలాగైనా పార్టీకి మునుపటి తేజస్సు రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలని పలువురు భావిస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని పలువురు సీనియర్ నాయకులు చంద్రబాబుతో కూడా చర్చించారని టాక్ వినిపిస్తుంది. అయితే చంద్రబాబు సైతం జూనియర్ ఎన్టీఆర్ రాక విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది.

 2014 ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్

2014 ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్

2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. కార్ యాక్సిడెంట్ లో ఆస్పత్రిలో ఉన్నప్పటికీ ఆయన బెడ్ మీద నుండే ప్రచారం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వాగ్ధాటి , సీనియర్ ఎన్టీఆర్ తరహాలో ఆయన టాలెంట్ మీద పార్టీ శ్రేణులకు నమ్మకం వుంది. ఇక పార్టీలో మెజార్టీ నాయకులూ జూనియర్ ఎన్టీఆర్ రాకను కాంక్షిస్తున్న తరుణంలో చంద్రబాబు కూడా ఎన్టీఆర్ కే మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది.

 జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో టీడీపీలో చర్చ

జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో టీడీపీలో చర్చ

టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ కి అప్పగిస్తే ఎలా ఉంటుంది. ఆయన పార్టీకి పూర్వ వైభవం తీసుకురావటానికి చేసే కృషిలో సక్సెస్ అవుతారా ? అసలు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడతారా ? అంత పెద్ద పార్టీని అసలు ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఎన్టీఆర్ నెట్టుకురాగలడా అని కొందరు నేతలు అంటున్నారు. ఇకపోతే ఎలాగైనా ఎన్టీఆర్ వల్లే టీడీపీకి పునర్వైభవం వస్తుందని మరొక వర్గం స్ట్రాంగ్ గా నమ్ముతుంది. మరి ఈ సమయంలో జూనియర్ రాక పై ఆశపెట్టుకున్న టీడీపీ నాయకులు త్వరలోనే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+