చంద్రబాబుకు మరో బ్యాడ్ న్యూస్ ? సుప్రీంకోర్టులో క్వాష్ విచారణ ఇంకా ఆలస్యం !

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ ను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించడంతో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వరుస సెలవుల కారణంగా చంద్రబాబు పిటిషన్ పై విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3న చంద్రబాబు పిటిషన్ విచారిస్తామని సీజేఐ తెలిపారు. కానీ అది ఇంకా ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

chandrababu to wait till oct 6 for supreme court hearing on quash petition in skill case

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ లను క్వాష్ చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీపై ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అక్టోబర్ 3న నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఈ పిటిషన్ పై సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రాతో పాటు మరో సీనియర్ లాయర్ హరీష్ సాల్వే కూడా కోరుతున్నారు. అయితే అక్టోబర్ 3న దీనిపై నిర్ణయం తీసుకుంటే అప్పటికే లిస్ట్ అయిన కేసుల విచారణకు ఆటంకం లేకుండా ఉండేందుకు దీన్ని అక్టోబర్ 6న లిస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.

ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో కేసుల లిస్టింగ్ అప్ డేట్ లో ఈ నెల 6న ఈ పిటిషన్ లిస్టింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో చంద్రబాబు కనీసం అక్టోబర్ 6 వరకూ ఎదురుచూడక తప్పని పరిస్దితి. ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబుకు ఈ పరిణామాలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. మరోవైపు ఇతర కేసుల్లోనూ చంద్రబాబు పీటీ వారెంట్లు కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేస్తోంది. దీంతో చంద్రబాబుకు మరిన్ని సమస్యలు తప్పేలా లేవు.

సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై వచ్చే తీర్పు ఈ కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో దీని కోసం టీడీపీ నేతలు, శ్రేణులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టు క్వాష్ పిటిషన్ తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+