బాబు 'రాజధాని' సాధ్యమా?: ఇదీ పుత్రజయ (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుత్రజయలాంటి రాజధానిని నిర్మించాలనే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. అలాంటి నగరం నిర్మాణం సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పుత్రజయ ఎలా ఉందనే దానిపై చర్చ సాగుతోంది.

అదే సమయంలో ఏపీలో అది సాధ్యమా.. అంటే కాకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుత్రజయ ప్రకృతి రమణీయతతో, ప్రశాంతంగా ఉంటుంది. కనుచూపుమేర ఎక్కడ చూసినా పచ్చని అందాలు దర్శనమిస్తాయి.

పుత్రజయ నగర నిర్మాణం 1995లో ప్రారంభమైంది. ఆరేళ్లలో ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ నగరంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు నివసిస్తారు.

పుత్రజయ

పుత్రజయ

ఈ నగరాన్ని రూ.48వేల కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రపంచంలోని మొట్టమొదటి ఉద్యాననగరం ఇది. కౌలాలంపూర్‌కు 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

పుత్రజయ

పుత్రజయ

ఈ నగరంలో 40 శాతం భారీ మంచినీటి జలాశయాలు, ఉద్యానవనాలతో పచ్చగా ఉంటుంది. బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం, అత్యున్నత రవాణా వ్యవస్థ ఉంది.

పుత్రజయ

పుత్రజయ

కౌలాలంపూర్, లాబౌన్ తర్వాత మలేషియా మూడో ఫెడరల్ టెర్రిటోరీ పుత్రజయ. ఈ నగరం మాజీ ప్రధాని మహతీర్ మహమ్మద్ బ్రెయిన్ చైల్డ్.

పుత్రజయ

పుత్రజయ

సంస్కృతంలో పుత్ర అంటే యువరాజు, జయ అంటే విజయం. పుత్రజయలో 67వేల మంది జనాభా ఉంటుంది. టోటల్ ఏరియా 49 కిలోమీటర్ స్కవైర్.

పుత్రజయ

పుత్రజయ

పుత్రజయను నగరం కంటే.. అద్భుతం అనవచ్చు. పుత్రజయను పూర్తి ప్రణాళికాబద్దంగా నిర్మించారు. ఇలాంటి నగరంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ ప్రతినిధులు త్వరలో పుత్రజయను సందర్శించనున్నారు.

ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం

అసలే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పుత్రజయలాంటి నగరాన్ని నిర్మించగలదా అనే చర్చ సాగుతోంది. రాజధాని కోసం ముప్పై నలభై వేల ఎకరాల భూమిని సేకరించడం కష్టసాధ్యమంటున్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

పుత్రజయలా పర్యావరణ పరిరక్షణ సాధ్యమా, అంతర్జాతీయ ప్రమాణాలు సాధ్యమా అంటున్నారు. పుత్రజయలాంటి నగరం సాధ్యాసాధ్యాల పైన ఏపీ ప్రభుత్వం పరిశీలన చేస్తోంది.

 ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి దాదాపు లక్షా 90వేల కోట్లు కావాలని ప్రభుత్వం చెబుతోంది. శివరామకృష్ణన్ కమిటీ లక్షా ఇరవై వేల కోట్ల వరకు అవసరమని చెబుతోంది.

వారు సిద్ధం

వారు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మెకంజీ, ఎల్ అండ్ టీ తదితర సంస్థలు సంసిద్దత వ్యక్తం చేశాయి. మరోవైపు, పుత్రజయలా కాకుండా.. ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఏపీ, ఉన్న నగరాన్నే రాజధానిగా చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+