• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప‌వ‌న్ క‌ల్యాణ్ 3 ఆప్ష‌న్ల‌కు చంద్ర‌బాబు ఒకే ఆప్ష‌న్‌??

|
Google Oneindia TeluguNews

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్ష‌న్లు ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. బీజేపీతో క‌లిసి పోటీచేయ‌డం, తెలుగుదేశం, బీజేపీతో క‌లిసి పోటీచేయ‌డం, ఒంట‌రిగా పోటీచేయ‌డం. చంద్ర‌బాబునాయుడు విష‌యంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ ఢిల్లీ పెద్ద‌లు స‌ముఖంగా లేరు. వారిని ఒప్పిస్తాన‌న్న న‌మ్మ‌కం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లో క‌న‌ప‌డుతోంది. కానీ మూడు ఆప్ష‌న్ల ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఒక్క‌సారిగా తెలుగుదేశం, జ‌న‌సేన రాజ‌కీయాలు మారిపోయాయి.

కార్యకర్తల ఒత్తిడితో పునరాలోచనలో చంద్రబాబునాయుడు

కార్యకర్తల ఒత్తిడితో పునరాలోచనలో చంద్రబాబునాయుడు


బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి రాయ‌ల‌సీమ‌లో చంద్ర‌బాబునాయుడికి అపూర్వ స్పంద‌న రావ‌డం, మ‌హానాడుకు ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా త‌ర‌లిరావ‌డంతో ఆ పార్టీ కొండంత ఆత్మ‌విశ్వాసంతో ఉంది. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌లంతా చంద్ర‌బాబునాయుడును ముఖ్య‌మంత్రిగా చూడాల‌నుకుంటున్నార‌ని, రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ప‌య‌నింపచేయ‌గ‌లిగే శ‌క్తి ఆయ‌న‌కు ఒక్క‌డికే ఉంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నార‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. నేత‌లు, నాయ‌కులు చెప్పే మాట‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని, క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై తిరిగేది మేమే కాబ‌ట్టి మా మాట‌లు న‌మ్మాలని, ఒంటరిగా పోటీచేద్దామంటూ అన్ని జిల్లాల నుంచి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌లు ఒత్తిడి చేయ‌డంతో చంద్ర‌బాబు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు.

పొత్తులపై బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దు?

పొత్తులపై బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దు?


జ‌న‌సేన‌తో పొత్తు విష‌యం గురించి మ‌హానాడులో కూడా అందుకే మాట్లాడ‌లేదు. పొత్తుల విష‌యంపై బ‌హిరంగంగా ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్ద‌ని తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధులుకు, సీనియ‌ర్ నేత‌ల‌కు అంత‌ర్గ‌తంగా ఆదేశాలు జారీచేశారు. ముందుగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ప‌టిష్ట‌ప‌రిచే ప‌నిపై దృష్టిసారించారు. 2019 ఎన్నిక‌ల్లో 40 శాతం ఓట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వ‌చ్చిన సీట్లు 23 కావ‌డం, టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఓట‌మి పాలైంది కూడా కేవ‌లం 1500, 2000 ఓట్ల తేడాతోనే కావ‌డం గ‌మ‌నార్హం.

పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి!

పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి!


జ‌న‌సేన చీల్చిన ఓట్ల‌వ‌ల్లే ఓట‌మిపాల‌య్యామ‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు వ్యాఖ్యానించారు. ఈసారి కూడా జ‌న‌సేన విడిగా పోటీచేస్తే ప‌రిస్థితులు ఎలా అర్థం కావ‌డంలేద‌ని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. అయితే ప్ర‌జ‌లంతా మాత్రం చంద్ర‌బాబువైపే ఉన్నార‌న్న‌ది సుస్ప‌ష్ట‌మంటున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని జ‌న‌సైనికులు డిమాండ్ చేస్తున్నారు. మాతో పొత్తు పెట్టుకోక‌పోయినా 2029 ఎన్నిక‌ల‌కు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతామ‌ని చెబుతున్నారు. అప్ప‌టివ‌ర‌కు తెలుగుదేశం పార్టీ అంగీక‌రించ‌క‌పోయినా భార‌తీయ జ‌న‌తాపార్టీతో క‌లిసి పోటీచేయాల‌ని జ‌న‌సేన భావిస్తున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

English summary
Chandrababu is the only option for Pawan Kalyan 3 options??
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X