Kuppam: చంద్రబాబుకు రైల్వేశాఖ గుడ్ న్యూస్..! కుప్పంలో ఇక ఆ రెండు రైళ్లకూ..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైల్వేశాఖ నుంచి కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయించుకుంటున్న చంద్రబాబు (Chandrababu)కు ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. అదీ తన సొంత నియోజకవర్గం కుప్పం (kuppam)లో తాను చేసిన ఓ ప్రతిపాదనకు రైల్వే మంత్రి ఆమోదం తెలుపుతూ తాజాగా లేఖ రాశారు. దీంతో కుప్పం వాసులకు ఇక ప్రయాణాల కష్టాలు తీరినట్లేనని భావిస్తున్నారు. ఇంతకీ రైల్వే శాఖ కుప్పానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో ఓసారి చూద్దాం..
చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ లో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో
వాస్కోడగామా- వేలంకణి మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలుతో పాటు దాదర్ సెంట్రల్-పాండిచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా స్టాప్ లు ఇచ్చారు. ఈ రెండు రైళ్లకూ కుప్పం రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసేందుకు ఆమోదం తెలుపుతూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సీఎం చంద్రబాబుకు స్వయంగా లేఖ రాశారు.

ఈ నెల 10 తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను సీఎం చంద్రబాబు కలిశారు. కుప్పం రైల్వే స్టేషన్ లో ఈ రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్టాపులు ఇవ్వాలని చంద్రబాబు ఆయన్ను కోరారు. దీనిపై రైల్వే అధికారులతో మాట్లాడిన మంత్రి అశ్వినీ వైష్ణవ్.. సాధ్యాసాధ్యాలు పరిశీలించి చివరికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు కుప్పం వాసులు ఇకపై ఈ రెండు రైళ్లలోనూ ప్రయాణాలు చేసేందుకు వీలు కలిగింది. అలాగే తన నియోజకవర్గం కుప్పానికి కేంద్రం నుంచి చంద్రబాబు ఓ వరం సాధించుకున్నట్లయింది. దీనిపై కుప్పం వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications