Chandrayaan 3: రాకెట్ నుంచి విడివడిన శాటిలైట్

తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో.. మరో ఘనతను సాధించింది. చంద్రయాన్ 3 రాకెట్‌ను నింగిలోకి పంపించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు దూసుకెళ్లింది ఈ రాకెట్. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. చందమామ దక్షిణ ధృవం వద్ద ల్యాండ్ అవుతుంది.

2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో. దీన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లనూ చేసింది. వారి అంచనాలకు అనుగుణంగా ప్రారంభం దశలో రాకెట్ ప్రయాణం.. సవ్యంగా సాగింది. దశలవారీగా అన్ని రాకెట్ నుంచి విడిపడినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

chandrayaan31

చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కేజీలు. ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో ఇది చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ అవుతుంది. చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్- పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్‌ను ఈ రాకెట్‌తో పాటు పంపించారు.

ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్‌, ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పోక్ట్రోస్కోపీ.. వంటివి ఈ రాకెట్ పేలోడ్స్. లాంచ్ ప్యాడ్ నుంచి దూసుకెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విజయవంతమైంది. రాకెట్ తన పథంలోనే సవ్యంగా సాగింది. కొద్దిసేపటి తరువాత రాకెట్ నుంచి చంద్రయాన్ 3 శాటిలైట్ విడిపోయింది.

ఇది అత్యంత కీలక దశ.. రాకెట్ నుంచి ఉపగ్రహం విడిపోయే సమయంలో ఏ చిన్న పొరపాటు చోటు చేసుకున్నా అది ప్రయోగం విఫలం కావడానికి దారి తీస్తుంది. అలాంటి సంఘటనలేవీ చోటు చేసుకోలేదు. ముందుగా నిర్దేశించినట్లుగా- రాకెట్ నుంచి చంద్రయాన్ 3 ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+