చెవిరెడ్డికి అస్వస్థత- హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..!!
వైసీపీ నేత చెవిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. లిక్కర్ కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి ఛాతీనొప్పి రావటంతో జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో, వెంటనే చెవిరెడ్డి ని జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సాయంత్రం వరకు పర్యవేక్షణలో ఉంచాలని సూచించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో అరెస్ట్ చేసిన చెవిరెడ్డి ని పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. చెవిరెడ్డిని నగదు లావాదేవీల పైన విచారణ చేస్తున్నట్ల తెలుస్తోంది.
జైలులో లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి కొద్ద సేపటి క్రితం ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు చెవిరెడ్డిని ఆస్పత్రికి తరలించగా పరీక్షలు చేసారు. సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. కాగా, మద్యం కుంభ కోణం కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుకు కూడా జులై 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అంతకు ముందు సిట్ అధికారులు ఆయన్ని మూడు గంటల పాటు విచారించారు. అయితే, సిట్ అధికారులు విచారణ చేసే సమయంలో సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.

విచారణ సమయంలో అధికారులను చెవిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేసారని సమాచారం. తేకాకుండా చదువుకుని సంతకాలు చేయమని ఇచ్చిన డాక్యుమెంట్ లను చెవిరెడ్డి చించివేసినట్లు తెలు స్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను ఏసీబీ కోర్టులో హాజరుపరచిన సిట్ అధికారులు దర్యాప్తు వీడియో ఫుటేజీని ఏసీబీ కోర్టులో సమర్పించారు. మద్యం కుంభకోణం కేసులో తాను విచారణకు సహకరిస్తానని చెప్పినా అరెస్టు చేశారని చెవిరెడ్డి న్యాయాధికారికి విన్నవించారు. విచారణ సమయంలో తాను చెప్పిన జవాబులు కాకుండా వారి సొంతానికి రాసుకున్నారని తెలిపారు. కాగా, వైద్య పరీక్షలు పూర్తయిన తరువాత చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులు చికిత్స పైన నిర్ణయం తీసుకోనున్నారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications