పవన్ పోటీ, రాజకీయాలపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు..!!
ఏపీ ఎన్నికల్లో మరోసారి చిరంజీవి ఎపిసోడ్ ఇంట్రస్టింగ్ గా మారుతోంది. తన సోదరుడు పవన్ కు మద్దతుగా పిఠాపురం ఓటర్లకు చిరంజీవి ఇప్పటికే వీడియో ద్వారా పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమిలో కొందరు సభ్యులకు సైతం చిరంజీవి మద్దతుగా నిలిచారు. తాజాగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. పిఠాపురంలో ప్రచారం చివరి రోజున చిరంజీవి ప్రచారం చేస్తారనే ప్రచారం ఉంది. దీంతో పాటుగా తన రాజకీయ భవిష్యత్ గురించి చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు.
తేల్చేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై ఆసక్తి కర అంశాలను వెల్లడించారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని మెగాస్టార్ స్పస్టం చేసారు. కొద్ది రోజులు పవన్ కు మద్దతుగా చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తారనే ప్రచారం ఉంది. దీని పైన చిరంజీవి స్పష్టత ఇచ్చారు. తాను పిఠాపురం వెళ్లడం లేదని తేల్చేసారు. బయట జరిగే ప్రచారమంతా అవాస్తవమని చెప్పారు. అదే సమయంలో ఎన్టీఆర్ భారతరత్న కు అర్హులని చిరంజీవి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఆ దిశగా ఆలోచించాలని సూచించారు.

పవన్ కోరుకోరు
పద్మవిభూషణ్ పురస్కారం తన అభిమానులదని చిరంజీవి చెప్పారు. ఏ సమయానికి ఏది రావాలో అవే వస్తాయని వ్యాఖ్యానించారు. ఆశపడితే అవార్డులు రావని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కు భారతరత్న రావాలనుకోవడం సముచితమని చెప్పుకొచ్చారు. ఎంజీఆర్ కు వచ్చినప్పుడు ఎన్టీఆర్ కు రావాలన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న రావాలని నేను కోరుకుంటున్నానని చిరంజీవి పేర్కొన్నారు. పిఠాపురానికి తాను రావాలని కళ్యాణ్ ఎప్పుడు కోరుకోరని చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తాను కంఫర్డ్ గా ఉంచాలనుకుంటారని వివరించారు.
పవన్ వెంటే ఉంటా
పవన్ వెంటే తాను ఉంటానని మొన్న ఒక వీడియోలో చెప్పానని చిరంజీవి గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా అన్న ప్రశ్నకు టాటా చెబుతూ వెళ్లిపోయిన చిరంజీవి పరోక్షంగా లేననే సంకేతాలు ఇచ్చారు.దీంతో, ఏపీలో రేపటితో ప్రచారం ముగుస్తున్న వేళ చిరంజీవి పిఠాపురంకి వస్తే రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. అయితే, తాను పిఠాపురం రాకుండా ఉంటేనే తాను కంఫర్ట్ గా ఉంటానని చిరంజీవి చెప్పటం ద్వారా రాజకీయ విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు పిఠాపురంలో జరగాల్సిన పవన్ రోడ్ షో వర్షం కారణంగా రద్దు అయింది. ఇక చివరి రోజున పిఠాపురంలో సీఎం జగన్ ప్రచారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications