'రాజకీయ కక్ష, చిరుకు అవమానం': 150వ సినిమాకు బాబు అనుమతివ్వడం లేదా?

చిరంజీవి అభిమానులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

విజయవాడ: చిరంజీవి అభిమానులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలకు విజయవాడలో అనుమతి ఇవ్వలేదని చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు నిరసన తెలిపారు.

సినీ పరిశ్రమను ఏపీకి తరలిస్తామని ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి చంద్రబాబు.. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 కొత్త చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలకు నగరంలో అనుమతి ఇవ్వకుండా సినీ పరిశ్రమను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖైదీ నెంబర్ 150 చిత్రం ఆడియో విడుదలయి ప్రభంజనం సృష్టిస్తోందన్నారు. నగరంలో తలపెట్టిన ఆ చిత్రం ఫంక్షన్‌కు ఎందుకు అనుమతి ఇవ్వరని శనివారం నాడు ప్రశ్నించారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అన్నారు.

Chiranjeevi fans fires at Chandrababu Naidu government

చిరంజీవి నటించిన 150వ చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కు నగరంలో అనుమతి ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా చిరంజీవి అభిమానులు నిరసనలు తెలుపుతారన్నారు.

ఇదిలా ఉండగా, ఖైదీ నెంబర్ 150 చిత్రం ప్రీ రిలీజ్ ఆడియో వేడుక ఈ నెల 4వ తేదీన విజయవాడలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే, ఈ వేడుకను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. విజయవాడ నుంచి గుంటూరుకు వేదిక మార్చనున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+