చిరంజీవి ఇంట మెగా ప్రిన్సెస్ బారసాల సందడి.. పేరు పెట్టనున్న ఉపాసన, రామ్ చరణ్!!

జూన్ 20వ తేదీన రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎంతోకాలంగా చిరంజీవి ఫ్యామిలీ ఈ మధుర క్షణాల కోసం ఎదురు చూడగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెగా ప్రిన్సెస్ చిరంజీవి ఇంట చిరునవ్వులు పూయిస్తూ, వారి సంతోషానికి, సంబరాలకు కారణమైంది.

ఇక ఇప్పటికే మెగా ప్రిన్సెస్ జాతకం అద్భుతంగా ఉందని, ఆమెకు రాజయోగం ఉందని జ్యోతిష్య పండితులు కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజాగా చిరంజీవి మనవరాలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు బారసాల కార్యక్రమం నేడు ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈ విషయాన్ని ఉపాసన అందరితో పంచుకున్నారు. నేడు మెగాస్టార్ చిరంజీవి మనవరాలు మెగా ప్రిన్సెస్ కు పేరు కూడా పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ramcharanupasanawithbaby

మరోవైపు నేడు చిన్నారి బారసాల కి సంబంధించిన ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు. చిరంజీవి ఇంట్లో ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఇక చిన్నారికి పెట్టే పేరును కూడా ఇప్పటికే ఫిక్స్ చేశారని సమాచారం. చిరంజీవి కుటుంబానికి ఆంజనేయ స్వామి అంటే ఎనలేని భక్తి. ఈ కారణంగా వారు చిన్నారికి ఆంజనేయుడి పేరు కలిసొచ్చేలా పేరుపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే చిన్నారి బారసాల కి సంబంధించి ఊయల ను ప్రజ్వల ఫౌండేషన్ వారు బహూకరించారు. హ్యాండ్ మేడ్, హ్యాండీక్రాఫ్ట్ ఊయలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన ఇది ప్రజ్వల ఫౌండేషన్ లోని యువత నుండి తాము అందుకున్న హృదయపూర్వక మైన, అద్భుతమైన బహుమతి అని పేర్కొన్నారు. ఈ బహుమతి ద్వారా తాము గౌరవించబడ్డామని వెల్లడించారు.

ఇది తన బిడ్డ యొక్క ఆత్మ గౌరవ ప్రయాణాన్ని సూచిస్తుందని వెల్లడించారు. ఇక మరోవైపు ఇప్పటికే యువ సంగీత దర్శకుడు, ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు గాయకుడు కాలభైరవ మెగా ప్రిన్సెస్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ను అందించారు. పాప కోసం వినసొంపైన ట్యూన్ క్రియేట్ చేసి దాన్ని రామ్ చరణ్ కు పంపించారు. మరోవైపు ఆలియాభట్ పాప కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన దుస్తులను గిఫ్ట్ గా పంపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+