ఓటు అక్కడ...రాజకీయం ఇక్కడ..ఎందుకు బ్రో...!
ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరికలు అధికం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వంటి నేతలు జనసేనలో చేరారు. మరి కొంతమంది నేతలు జనసేనలో చేరడానికి సిద్దంగా ఉన్నారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో జానీ మాస్టర్ పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీ వీరాభిమాని అనే విషయం అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు బహిరంగంగానే చెప్పడం జరిగింది. కొద్దికాలంగా ఆయన పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు.

ఆ మధ్య జగన్ సర్కార్ మీద నేరుగానే విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. అంగన్‌వాడీలు చేసిన ధర్నాకు మద్దతుగా నిలిచిన జానీ మాస్టర్ సీఎం జగన్ మీద విమర్శలు చేశారు. రామ్ గోపాల్ వర్మకు పవన్ కల్యాణ్ అంటే ఎంత ఇష్టమో.. నాకు జగన్ అంటే అంతే ఇష్టమని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు జానీ మాస్టర్‌పై ఘాటుగానే విమర్శలు చేశారు.
డబ్బులు కోసం స్టేజీల మీద డ్యాన్సులు వేసే నీకు జగన్‌ను విమర్శించే స్థాయి ఉందా అంటూ జానీ మాస్టర్‌పై వైసీపీ కార్యకర్తలు విరచుకుపడ్డారు. తాజాగా జానీ మాస్టర్ జనసేనలో చేరడంతో మరోసారి వైసీపీ కార్యకర్తలకు ఆయన టార్గెట్ అయ్యారు. తెలంగాణలో ఓటు వేసిన జానీ మాస్టర్‌కు .. ఏపీలో రాజకీయాలు గురించి మాట్లాడే హక్కు లేదని .. అదుపు తప్పి తమ నాయకుడు గురించి మాట్లాడితే తాట తీస్తామంటూ వైసీపీ కార్యకర్తలు జానీ మాస్టర్‌కు వార్నింగ్ ఇస్తున్నారు.
ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్ @AlwaysJani బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. pic.twitter.com/x1ssPyHnjz
— JanaSena Party (@JanaSenaParty) January 24, 2024
మెగా ఫ్యామిలీకి భజన చేయకపోతే..ఇలాంటి వారికి సినిమాల్లో అవకశాలు ఉండవని .. అందుకే వీరంతా పవన్ జపం చేస్తున్నారని వైసీపీ నాయకులు జానీ మాస్టర్‌ని ఎద్దెవా చేస్తున్నారు. మరి వైసీపీ నాయకుల చేస్తోన్న ట్రోలింగ్‌పై జానీ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications