TTD New Chairman:టీటీడీకి నూతన ఛైర్మన్ - చంద్రబాబు ఛాయిస్..!!

TTD New Chairman:ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. చంద్రబాబు పాలన ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తరువాత కుటుంబ సభ్యలతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ నుంచి ప్రక్షాళన ప్రారంభం అవుతుందని ప్రకటించారు. టీటీడీ నూతన ఛైర్మనం ఎంపిక పైన చంద్రబాబు కసరత్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. అందులో ఒక సీనియర్ నేత పేరు ఖరారయ్యే అవకావం కనిపిస్తోంది.

చంద్రబాబు కసరత్తు
ఏపీలో మంత్రివర్గం ఏర్పాటైంది. శాఖలు ఈ రోజు ప్రకటించనున్నారు. ఇక..అధికారంలోకి వచ్చిన తరువాత పలు ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో మార్పుల దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అందులో పాలనా పరంగా ప్రక్షాళన టీటీడీ బోర్డు నుంచి చేయాలని నిర్ణయించారు. టీటీడీకి జగన్ హాయంలో ఛైర్మన్ గా పని చేసిన కరుణాకర రెడ్డి రాజీనామా చేసారు. ఈవో ధర్మారెడ్డి సెలవుపై వెళ్లారు. ఇప్పుడు నూతన ఛైర్మన్ తో పాటుగా ఈవో నియామకం పైన చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు. ఎలాంటి విమర్శలు..చర్చలకు తావు లేకుండా ఛైర్మన్..సభ్యుల ఎంపిక చేయాలని నిర్ణయించారు.

CM Chandra Babu begin exercise on appoint new Chairman for TTD see deets

టీటీడీ ఛైర్మన్ ఎవరు
ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తరువాత నూతన టీటీడీ ఛైర్మన్ ఎవరు అవుతారనే చర్చ పార్టీలో జరిగింది. పార్టీకి అన్నిసమయాల్లో అండగా నిలిచిన ఒక మీడియా సంస్థ అధినేత కు అవకాశం ఇవ్వనున్నారని పార్టీలో ప్రచారం సాగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. అదే సమయంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే సినీ ప్రముఖు నిర్మాత పేరు తెర మీదకు వచ్చింది. గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్ గా దర్శకుడు రాఘవేంద్రరావు పని చేసారు. దీంతో, ఈ నిర్మాతకు అవకాశం దక్కుతుందనే అభిప్రాయం వినిపించింది.

Ashok Gajapathi raju TTD chairman

అవకాశం దక్కేదెవరికి
ఇప్పుడు తాజాగా పార్టీలో సీనియర్ నేత..కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. అశోక్ గజపతి రాజు కుమార్తె ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వర్గంలో క్షత్రిక సామాజిక వర్గానికి అవకాశం దక్కలేదు. దీంతో..అశోక్ గజపతి రాజుకు ప్రతిష్ఠాత్మక టీటీడీ ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా అశోక్ గజపతి రాజు వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తాజాగా పార్టీ ముఖ్యుల్లో చర్చ సాగుతోంది. దీంతో..చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+