ఏపీ నూతన డీజీపీ ఖరారు - చంద్రబాబు ఎంపిక వెనుక..!!

ఏపీ నూతన డీజీపీ దాదాపు ఖరారయ్యారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం నాటి డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి స్థానంలో హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం ఇచ్చింది. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ద్వారకా తిరుమల రావును డీజీపీగా నియమించారు. ఇప్పుడు ఆయన స్థానం లో కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది. అయితే, కొత్త డీజీపీ ఎంపిక పైన సీఎం చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో, కొత్త డీజీపీ నియామకం
ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో డీజీపీగా పని చేసిన సీనియర్ ఐపీఎస్, 1992 బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తా వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోం . సీనియారిటీ లిస్టులో 1991 బ్యాచ్‌కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మాదిరెడ్డి ప్రతాప్‌ మొదటి స్థానంలోఉండగా.. హరీష్‌ కుమార్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ గతం లో జగన్ హయాంలో ఆర్టీసీ ఎండీగా పని చేసారు. ఆ సమయంలో ఒక వివాదంలో ప్రభుత్వం ఆయన పైన విచారణకు ఆదేశించింది.

CM Chandra Babu chances appoint Harish Kumar Gupta as new DGP in place Tirumala Rao

మాదిరెడ్డి ప్రతాప్ పై ప్రస్తుత ప్రభుత్వం ఆ విచారణ నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావును కొనసాగిస్తారనే అంశం పైనా చర్చ జరిగింది. కానీ, ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లలేదు. దీంతో, కొత్త డీజీపీ ఖాయమైంది. ఈ సమయంలోనే సీనియర్ ఐపీఎస్ రవి శంకర్ అయ్యన్నార్ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, అన్ని సమీకరణాల్లోనూ పరిశీలన తరువాత విజయనగరం జిల్లాకు చెందిన హరీశ్ కుమార్ గుప్తా కొత్త డీజీపీగా ఖరారు చేసినట్లు సమాచారం. హరీశ్ కుమార్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా పని చేస్తున్నారు.

సీనియార్టీ, సుదీర్ఘ సేవలను పరిగణలోకి తీసుకొని డీజీపీని ఖరారు చేయనున్నారు. దీంతో, ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా పేరు వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత డీజీపీ నియామకం పైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+