హెలికాప్టర్ నుంచి పవన్ వీడియో, ఆ ఎమ్మెల్యేలకు డెడ్ లైన్ - మంత్రులకు బిగ్ టాస్క్..!!

మంత్రులకు చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తే ఇంచార్జి మంత్రులు జోక్యం చేసుకుని సరిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పేదలం దరికీ హౌసింగ్ కల్పించే విషయంలో బాధ్యత తీసుకోవాలని సూచించారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన ఆక్రమణలను తాను హెలికాప్టర్ నుంచి వీడియో తీశానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. ఎర్రచందనం విషయంలో పవన్ ప్రయత్నాలను చంద్రబాబు అభినందించారు.

ఏపీ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ప్రధానంగా ఈ నెల 14,15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడి దారుల సదస్సు పైన మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దే శం చేసారు. రాష్ట్రంలోని పేదలందరికీ హౌసింగ్ కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నివాస స్థలం లేని వారందరి అర్హుల జాబితా రూపొందించి అందరికీ హౌస్ సైట్స్ దక్కేలా చూడాలన్నారు.

CM Chandra Babu fixed action plan for ministers to focus on Govt priorities

సంవత్సరంలోగా నివాస స్థలం లేని వారికి లబ్ది చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని సూచించారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకునేలా ఇంఛార్జ్ మంత్రులు చొరవ చూపాలని స్పష్టం చేసారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయం లో జాప్యం తగదని..పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని సూచించారు.

ఇక, విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ ద్వారా యువతకు మనం ఏం చేస్తున్నారో తెలియజేయా లని సీఎం చంద్రబాబు సూచించారు. పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఉప రాష్ట్రపతి వస్తున్నారని చెప్పారు. ఇక.. పుటపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని సూచించారు. ఇక.. పలువురు ఎమ్మెల్యే ల వ్యవహార శైలి.. వివాదాల పైనా చర్చ జరిగింది. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తుంటే.. ఇంచార్జి మంత్రులు జోక్యం చేసుకుని సరిచేయాలని దిశానిర్దేశం చేశారు.

CM Chandra Babu fixed action plan for ministers to focus on Govt priorities

ఈ సమయంలో జోక్యం చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ ఈ విషయాన్ని కూటమి ఎమ్మెల్యేలకు మంత్రులే వివరంగా చెప్పాలని సూచించారు. ఇక.. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎజెండా గా పెట్టుకుని ఇంచార్జి మంత్రులు పరిష్కారం చేయాలని ఆదేశించారు. అనంతపురంలో రెవెన్యూ సమస్యలను రెవెన్యూ అధికారులందరూ కూర్చోబెట్టి పరిష్కారం చేశారని గుర్తు చేశారు.

ఎర్ర చందనం విషయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. పెద్దిరెడ్డి రామ చంద్ రారెడ్డి చేసిన ఆక్రమణలను తాను హెలికాప్టర్ నుంచి వీడియో తీశానని చెప్పారు. త్వరలోనే ఈ వీడియో రిలీజ్ చేస్తానని తెలిపారు. కొత్త జిల్లాల పైన చర్చకు రాగా.. లోతుగా చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+