ఆ మంత్రుల పై చంద్రబాబు కీలక నిర్ణయం..!!

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం లో మంత్రుల పని తీరు పైన చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. మంత్రుల సమర్ధత, పనితీరు పైన నివేదికలు కోరిన చంద్రబాబు.. వారి పైన వస్తున్న ఫిర్యాదులపై ఆరా తీస్తున్నారు. మంత్రులకు వారి సామర్ధ్యం ఆధారంగా ర్యాంకులు ఖరారు చేస్తున్నారు. అయితే, కొందరు మంత్రుల పేషీల్లో జరుగుతున్న వ్యవహారాల పైన సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో...వారి పైన కీలక నిర్ణయం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

నివేదికల ఆధారంగా
ఎన్డీఏ కూటమిలోని మంత్రుల పనితీరు పైన చంద్రబాబు నివేదికలు సిద్దం అవుతున్నాయి. నిఘా వర్గాలతో పాటుగా.. అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చంద్రబాబు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈ సారి కొత్త వారికి చంద్రబాబు మంత్రులుగా అవకాశం కల్పించారు. వారిలో ఇద్దరి వ్యవహార శైలి పైన ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలకు వెళ్లిన సమయంలో కూటమి పార్టీలకు చెందిన వారి సమన్వయం.. కేటాయించిన శాఖల పైన పట్టు విషయంలో మరో ముగ్గురు మంత్రులు వెనుకంజలో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో, తాజా గా మంత్రుల కార్యాలయాలకు కీలక ఆదేశాలు అందాయి.

CM Chandra Babu foucs on Ministers performance in departments and in party affairs seek report

మంత్రుల పై ఫిర్యాదులు
మంత్రుల శాఖలకు సంబంధించి ఈ ఏడు నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలు.. సంస్కరణల తో పాటుగా సాధించిన ప్రగతి గురించి నివేదికలు పంపాలని సూచించారు. అందులో అధికారంలో కి వచ్చిన తరువాత జూలై నుంచి డిసెంబర్ వరకు ఈ నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. మంత్రి గా శాఖల్లో తీసుకున్న నిర్ణయాలతో పాటుగా ఇంఛార్జ్ మంత్రులుగా అక్కడ ఎలాంటి ప్రభావం చూపించారనే కోణంలో నివేదికలు సేకరిస్తున్నారు. ప్రభుత్వంలో పాత్ర.. శాఖల నిర్వహణ.. పార్టీ వ్యవహారాల్లో మంత్రుల పని తీరు పైన నివేదికల కోసం ఆరు ఫార్మాట్లను ఖరారు చేసారు.

కీలక నిర్ణయాలు
ఈ నివేదికల ద్వారా మంత్రుల నుంచి వచ్చిన నివేదికలు తమ వద్ద ఉన్న సమాచారంతో పోల్చి చూసి ఒక అంచనాకు రానున్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, ఉత్తరాంధ్ర కు చెందిన ఒక మంత్రితో పాటుగా, గోదావరి జిల్లాలకు చెందిన మరో యువ మంత్రి పైన ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. సీమలో ప్రధాన జిల్లాకు చెందిన కీలక మంత్రి పైన పార్టీలో చర్చ సాగుతోంది. ఇక.. జనసేన మంత్రులకు సంబంధించిన సమాచారం డిప్యూటీ సీఎం పవన్ కు పంపిస్తున్నారు. ఈ నివేదికల ఆధారంగా చేయాల్సిన మార్పులు - చేర్పుల పైన చంద్రబాబు .. పవన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+