లోకేష్ కు ప్రమోషన్ ఎప్పుడో తేల్చేసిన చంద్రబాబు..!!

ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతల డిమాండ్ కొత్త వివాదానికి కారణమైంది. టీడీపీ - జనసేన మధ్య ఈ అంశం పైన పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తరువాత రెండు పార్టీల నాయకత్వం ఈ అంశం పైన స్పందించవద్దని స్పష్టం చేయటంతో... వివాదం ముగిసింది. ఇక, ఇప్పుడు లోకేష్ కు డిప్యూ టీ సీఎం గా అవకాశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. లోకేష్ ప్రమోషన్ పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబు క్లారిటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడు... మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనే అంశం పైన కీలక విశ్లేషణ చేసారు. వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం.. ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చుట్టూ ఉన్న పరిస్థితి ల కారణంగా అవకాశాలు వస్తాయని.. ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని చంద్రబాబు తేల్చి చెప్పారు. తమ కుటుంబం 33 ఏళ్ల క్రితం వ్యాపారం ప్రారంభించామని.. లోకేష్ కు వ్యాపారం అయితే తేలిక అని చెప్పుకొచ్చారు. కానీ, లోకేష్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం తో రాజకీయాల్లోకి వచ్చారని వివరించారు.

CM Chandra Babu gives clarity over promotion for Lokesh as Dy CM explains his plans

వారసత్వం అర్హత కాదు
ఏ రంగమైనా విజయాన్ని సాధించాలంటే కేవలం వారసత్వం మీద ఆధారపడటం కష్టమని చంద్రబాబు స్పష్టం చేసారు. వ్యాపారం, సినిమా, రాజకీయాలు, కుటుంబ వ్యవహారాలు వంటి ఏ రంగమైనా కేవలం వారసత్వంతోనే ఎవరూ విజయాలను సాధించలేరని చంద్రబాబు విశ్లేషిం చారు. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడంలో ప్రత్యేకంగా ముందుకు వచ్చారని చంద్రబాబు ప్రశంసించారు. అతని కృషి, నిబద్ధత వల్లే ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అవ్వాలనే ఉద్దేశం తనకు లేదని తేల్చేసారు.

కేంద్ర మంత్రిగా వెళ్లను
ఏపీలో ప్రజలు ఇచ్చిన బాధ్యత పైనే తాను ఆలోచన చేస్తున్నానని స్పష్టం చేసారు. తమ పాలనలో రాజకీయ కక్ష్యకు అవకాశం ఉండదని చెప్పుకొచ్చారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తారా అనే ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తి కర సమాధానం ఇచ్చారు. ఎవరైనా ఒకసారే మోసం చేయగలుగుతారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ద్వారా ప్రస్తుతం లోకేష్ డిప్యూటీ సీఎం అంశానికి ముగింపు ఇచ్చినట్లుగానే భావిస్తున్నారు. ఇక, ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణంలో చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+