ఆ పదవి జనసేనకు కాదు - చంద్రబాబు మార్క్ నిర్ణయం..!?
ఏపీలో రాజకీయంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. మూడు పార్టీల ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఉప మఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టారు. నూతన అసెంబ్లీ సమావేశ ముహూర్తం ఖరారైంది. నూతన అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఖరారయ్యారు. బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పదవి విషయంలో తాజాగా కీలక మార్పు జరిగినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు - పవన్ చర్చలు
ఏపీ అసెంబ్లీకి కొత్త స్పీకర్ పై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన అయ్యన్న పాత్రుడును ఎంపిక చేసారు. డిప్యూటీ స్పీకర్ మిత్రపక్షం జనసేనకు ఇవ్వాలని తొలుత భావించారు. ఇందు కోసం జనసేన నుంచి ఇద్దరి పేర్లు తెర మీదకు వచ్చాయి. అందులో లోకం మాధవి, పంతం నానాజీ పేర్లు పరిశీలించారు. విశాఖ జిల్లాకు స్పీకర్ పదవి ఇవ్వటంతో...పొరుగున విజయనగరం జిల్లాకు చెందిన లోకం మాధవికి ఇవ్వటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రివర్గంలో అవకాశం దక్కని వర్గానికి డిప్యూటీ ఇవ్వాలని భావించారు.

మిత్రపక్షానికి కేటాయింపు
అందులో భాగంగా లోకం మాదవి..లేదంటే, గోదావరి జిల్లాల నుంచి పంతం నానాజీ పేర్ల పైన చర్చ జరిగింది. ఇదే అంశం పైన చంద్రబాబు - పవన్ మధ్య తాజాగా చర్చ రాగా.. మరో ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు సమాచారం. కేబినెట్ లో బీజేపీకి ఒకటే మంత్రి పదవి దక్కింది. దీంతో..బీజేపీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వటం పైన చంద్రబాబు ప్రతిపాదన చేయగా..పవన్ ఆమోదం తెలిపారని తెలుస్తోంది. దీంతో, డిప్యూటీ స్పీకర్ పదవి బీజేపీ నుంచి ఎవరికి ఇవ్వాలనేది చర్చించారు. క్షత్రియ సామాజిక వర్గానికి కేబినెట్ లో అవకాశం లేకపోవటంతో ఆ వర్గానికి డిప్యూటీ ఇచ్చే అంశం పరిశీలించాలని నిర్ణయించారు.
డిప్యూటీ అయ్యేదెవరు
బీజేపీ నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన విష్ణుకుమార్ రాజు పేరు వినిపిస్తోంది. అయితే, స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు అదే జిల్లా కావటంతో ఇప్పుడు విజయవాడ వెస్ట్ నుంచి గెలిచిన సుజనా చౌదరి.. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నుంచి గెలిచిన నల్లిమిల్లి రామక్రిష్ణారెడ్డి పేర్ల పైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షాలకు ఇవ్వటం ఖాయమైందని చెబుతున్న సమయంలో ఉండి ఎమ్మెల్యే రఘురామ రాజుకు ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికి కారణమవుతోంది.












Click it and Unblock the Notifications