పెన్షన్ల పంపిణీ పై చంద్రబాబు తాజా నిర్ణయం...!!
కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం లో పెన్షన్ ను రూ 4 వేలకు పెంచి అమలు చేస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీన సచివాలయ సిబ్బందితో ఇంటికే పెన్షన్ అందిస్తోంది. అయితే, ఈ నెల పెన్షన్లను ఒక రోజు ముందుగానే రేపు (మంగళవారం) పంపిణీ చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఒక రోజు ముందుగానే
ఏపీ ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. జనవరి 1న అందాల్సిన పెన్షన్లను ఒక రోజు ముందుగానే రేపు (మంగళవారం) పంపిణీ చేయనుంది. తాజాగా వచ్చిన అభ్యర్ధనల మేరకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. ఈ సారి పల్నాడు జిల్లా నర్సరావు పేట నియోజకవర్గం లోని యలమంద గ్రామంలో చంద్రబాబు పాల్గొనేలా షెడ్యూల్ ఫిక్స్ అయింది.

పల్నాడుకు సీఎం
వైసీపీ హయాంలో వాలంటీర్లు ప్రతీ నెలా ఒకటో తేదీన లబ్ది దారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే వారు. ఇప్పుడు కూటమి పాలన లో వాలంటీర్లను పక్కన పెట్టారు. వార్డు, గ్రామ సచివాలయా ల సిబ్బందితోనే లబ్దిదారుల ఇళ్లకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. పంపిణీ విధానాన్ని రియల్ టైం లో పరిశీలిస్తోంది. ప్రతీన నెలా ఒకటో తేదీనే దాదాపుగా పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, ఒకటో తేదీన సెలవు, ప్రత్యేక సందర్భాలు ఉంటే ముందు రోజునే పంపిణీ చేసేలా ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేసింది.
రెండు నెలలు తీసుకోకపోయినా
దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల కు పైగా ఉన్న పెన్షన్ లబ్ది దారులకు డిసెంబర్ 31న మంగళవారం రోజున పెన్షన్లు అందనున్నాయి. వరుసగా రెండు నెలలు పెన్షన్లు తీసుకోని వారు సైతం ..మూడో నెల ఒకేసారి పెన్షన్లు తీసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో, పెన్షన్ పంపిణీ వేళ అందుబాటులో లేని లబ్దిదారులకు మేలు జరగనుంది. అయితే, పెన్షన్ల లబ్దిదారుల్లో అర్హత లేని వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. వారి విషయంలో పూర్తి నివేదిక అందిన తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా కొత్తగా పెన్షన్ల మంజూరు కోసం పెద్ద సంఖ్యలో లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. జనవరి 2న జరిగే మంత్రివర్గ సమావేశంలో వీరి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications