వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత చేసి.. మాపైనే విమర్శలా?, వైసీపీకి ఎంతసేపూ అదే..: బాబు, ఆస్తులపై వివరణ..

|
Google Oneindia TeluguNews

Recommended Video

YS Jagan Fools People name of MPs resignation

అమరావతి: కేంద్రంపై ఎవరు గట్టిగా పోరాడితే వచ్చే ఎన్నికల్లో వాళ్లకంత పొలిటికల్ మైలేజ్. కాబట్టే.. ఏపీలోని ప్రధాన, ప్రతిపక్ష పార్టీలు రెండు ఇప్పుడు కేంద్రంపై మేమంటే మేము మాత్రమే చిత్తశుద్దితో ఫైట్ చేస్తున్నామని వాదించుకుంటున్నాయి. రాజకీయ అవకాశం వాదం తమది కాదని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి ఎంతో కొంత సాధించుకోకపోతే గనుక ప్రజల ముందు టీడీపీ దోషిగా నిలబడక తప్పదు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అటు వైసీపీ కూడా సిద్దమైపోయింది. ఏకంగా రాజీనామా అస్త్రాన్నే సంధించబోతున్నామని జగన్ ప్రకటించేశారు. అయితే ఈ విషయంలో జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరించారన్న వాదన కూడా లేకపోలేదు.

ఏదేమైనా వైసీపీ ఇంత దూకుడు ప్రదర్శిస్తుండటంతో టీడీపి మరింత అప్రమత్తమైంది. అసలు ఆ పార్టీ వల్లే ఇంత డ్యామేజ్ జరిగిందంటూ తాజా కోర్ కమిటీ సమావేశంలో చంద్రబాబు వాపోయారు.

మాపై కాదు.. ఫోకస్ కేంద్రంపై పెట్టండి, శ్వేతపత్రంతో పనిలేదు: పవన్‌కు దిమ్మతిరిగే షాక్ మాపై కాదు.. ఫోకస్ కేంద్రంపై పెట్టండి, శ్వేతపత్రంతో పనిలేదు: పవన్‌కు దిమ్మతిరిగే షాక్

ప్రతిపక్షానివి ఎంతసేపూ రాజకీయాలే..: చంద్రబాబు

ప్రతిపక్షానివి ఎంతసేపూ రాజకీయాలే..: చంద్రబాబు

హోదానా, ప్యాకేజీనా అన్నది ముఖ్యం కాదు. హోదా ద్వారా అందాల్సిన ప్రయోజనాలు ప్యాకేజీ రూపంలో ఇస్తామన్నారు. అవి ఇచ్చి తీరాల్సిందే. ప్రతిపక్షానికేమో రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయాలే ముఖ్యం.

అందుకే హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి టీడీపీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు, ప్రయోజనాలు ఏదో రూపంలో సాధించుకోవాలన్నదే ప్రభుత్వ తాపత్రయం. ప్రజలకు ఇదే చెప్పాలి.

ఇంత చేసి.. మళ్లీ విమర్శలా?: చంద్రబాబు

ఇంత చేసి.. మళ్లీ విమర్శలా?: చంద్రబాబు

గతంలో వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేసినందుకే కేంద్రం ఉపాధి హామీ పథకం నిధులను నిలిపివేసింది. అయితే వాళ్ల ఫిర్యాదులు అవాస్తవమని తెలిశాక మళ్లీ నిధులు పునరుద్దరించింది.

పోలవరంపై కూడా ఇలాంటి ఫిర్యాదులతోనే పేచీలు పెట్టారు. నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మళ్లీ నిధులు తీసుకురావడం లేదని విమర్శలు. వైసీపీకి రాజకీయ ప్రయోజనాలే కావాలి తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచనే లేదు

ఇద్దరూ ఇద్దరేనా?:

ఇద్దరూ ఇద్దరేనా?:

సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే.. వైసీపీ మోకాలు అడ్డుపెడుతుండటం వల్లే కేంద్రం రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం లేదన్న విషయం అర్థమవుతోంది.

అయితే కేంద్రంపై పోరాటంలో వైసీపికి ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోనన్న భయంతోనే చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారా? అన్న ప్రశ్న కూడా లేకపోలేదు. ఏదేమైనా ఇరు పార్టీలు రాజకీయంగా లబ్ది పొందడానికి కేంద్రంపై పోరాటాన్ని ఓ సాకుగా చూపబోతున్నాయన్న విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి.

ఆస్తులపై బాబు వివరణ

ఆస్తులపై బాబు వివరణ

దేశంలో ఉన్న 31 మంది సీఎంలలో అత్యంత సంపన్న సీఎం చంద్రబాబు నాయుడేనని ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌) అనే సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. చరాస్తుల, స్థిరాస్తులు కలిపి ఆయన ఆస్తుల విలువ రూ.177,78,95,611కోట్లుగా తేల్చింది.

ఈ నేపథ్యంలో ఆస్తుల విలువపై చంద్రబాబు స్పందించారు. కుటుంబ ఆస్తులు కూడా లెక్కలోకి తీసుకోవడం వల్లే తాను దేశంలోకెల్లా సంపన్న సీఎంగా కనిపిస్తున్నానని అన్నారు. హెరిటేజ్ సంస్థలో భాగస్వామిగా ఉన్న తన భార్య భువనేశ్వరి ఆస్తులు కూడా కలపడం వల్లే లెక్క పెరిగిందన్నారు. అయినా ప్రతి ఏటా తాము ఆస్తులు ప్రకటిస్తూనే ఉన్నామని, తేడా ఉంటే చూసుకోవాలని అన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has once again criticized YSRCP on special status issue in party meeting on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X