సుజయతో భేటీకి డుమ్మా: టిడిపి ఎమ్మెల్యేలపై బాబు సీరియస్, వార్నింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు తెలుగుదేశం పార్టీ నేతల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం సాయంత్రం ఆయనను కలిసేందుకు జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే, వారు విజయనగరంలో మంత్రి సుజయ కృష్ణ రంగారావు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు.

నంద్యాల మాదే, 24న అభ్యర్థి ప్రకటన: అఖిల, బాబుకు శిల్పా అల్టిమేటం?

దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజయ నిర్వహించిన సమీక్షకు హాజరు కాకుండా తన వద్దకు సచివాలయానికి రావడం ఏమిటని ఆయన మండిపడ్డారు.

 CM Chandrababu lashes out at Vijayanagaram MLAs

సమన్వయంతో పని చేయకపోతే ఉపేక్షించనని హెచ్చరించారు. కాగా, సుజయను పార్టీలోకి తీసుకోవడం, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంపై పలువురు జిల్లా టిడిపి నేతలు అసంతృప్తితో ఉన్నారు.

చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు (గురువారం) సీఎం చంద్రబాబు పుట్టిన రోజు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్ తదితరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతిలో మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu on Wednesday fired at at Vijayanagaram MLAs.
Please Wait while comments are loading...