పోలా.. అద్దిరిపోలా: క్యాడర్‌కు కిక్

Ghibli trends: జపాన్‌కు చెందిన యానిమేషన్ స్టూడియో ఘిబ్లీ. ఈ స్టూడియో రూపొందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. ఇది ఎంతగా ఫ్యాషన్ అయిపోయిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ అందరూ ఘిబ్లీ ట్రెండ్స్‌లో ఎంటర్ అయ్యేంత.

ఘిబ్లీ స్టూడియో ఇచ్చిన స్ఫూర్తితో యానిమేటెడ్ ఫొటోలను పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు సంచలనం రేపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కొత్తగా ఘిబ్లీ తోడైంది. రాజకీయాలు, సినిమా, పారిశ్రామికం.. ఇలా ఒక్కటి కాదు- అన్ని రంగాలకు చెందిన సెలెబ్రిటీలు, సోషల్ మీడియా యూజర్లు.. ఘిబ్లి స్టైల్‌లో తమ ఫొటోలను చూసుకుని మురిసిపోతున్నారు.

CM Chandrababu made a grand entry into the Ghibli trends

టెక్నాలజీలో ముందుండే చంద్రబాబు కూడా ఈ ఘిబ్లీ ట్రెండ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి సంబంధించన ఓ మూడు ఘిబ్లీ ఫొటోలను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఇందులో ఒకదాంట్లో ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి దిగిన ఫొటో ఉంది.

మరొకటి కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటో. భార్య భువనేశ్వరి, కొడుకు, మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి గతంలో దిగిన ఓ ఫొటోను ఘిబ్లీ స్టైల్‌లో తీశారు. ముచ్చటగా మూడోది- ప్రజలకు సేవ చేస్తోన్నది. మోకాలి లోతు నీళ్లల్లో దిగిన ఓ మహిళను పరామర్శిస్తోన్న ఫొటో అది. విజయవాడలో వరదలు సంభవించినప్పటిదిగా చెప్పుకోవచ్చు.

ఘిబ్లి ట్రెండ్స్‌లో అడుగు పెట్టే విషయంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఓ అడుగు ముందే ఉన్నారు. తన తండ్రి కంటే ముందుగానే ఘిబ్లీ ట్రెండ్‌లోకి అడుగుపెట్టారు. లోకేష్ కూడా ఓ మూడు చిత్రాలను పోస్ట్ చేశారు. ఈ ట్రెండ్‌ను నాంది పలికారాయన. మొదటి ఫొటోలో తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు.

Take a Poll

తన అభిమానులతో కలిసి ఉన్న మరో రెండు ఫొటోలను నారా లోకేష్ షేర్ చేశారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఒకే రోజున.. నిమిషాల వ్యవధిలో ఘిబ్లీ ట్రెండ్‌లోకి ప్రవేశించడం టీడీపీ క్యాడర్‌ను ఉత్సాహ పరిచినట్టయింది. పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవం వేళ ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+