దళిత యువకుడికి ఊహించని షాక్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. వరాల జల్లు
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. పొన్నెకల్లు గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించిన తరుణంలో ఓ దళిత కుటుంబానికి వరాల జల్లు కురిపించారు. స్థానికంగా ప్రవీణ్ అనే యువకుడి బైక్ రిపేర్ షాపుకు వెళ్లారు. ఈ క్రమంలోనే అతడి ఇంటికి సైతం వెళ్లి ఊహించని ఆనందం పంచారు. అతని స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు.
అంతే కాకుండా బైక్ మెకానిక్‌ల సమస్యలను ప్రవీణ్ ద్వారా సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. సరైన టూల్స్ లేకుండా మెకానిక్ పని ఎలా చేస్తావు ? షెడ్ ఈ విధంగా ఉంటే ఎక్కువ మంది ఎలా వస్తారు? అని ఆ యువకుడిని ఆరా తీశారు. అతడికి మంచి శిక్షణ ఇచ్చి, మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని అధికారులు, స్థానిక నేతలకు సూచించారు. ఇల్లు కూడా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

అందుకే మరో చోట షాప్ పెట్టించి.. నీకు మంచి టూల్స్ కూడా ఇస్తాం అని తెలిపారు. పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కలలో కూడా తన ఇల్లు, మెకానిక్ షెడ్డుకు సీఎం చంద్రబాబు వస్తారని ఊహించలేదంటూ చెప్పుకొచ్చారు.
దళిత యువకుడు ప్రవీణ్ కలలో కూడా ఊహించి ఉండడు.. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తన ఇంటికి, తన మెకానిక్ షాప్‌కి వస్తారని..!
— Telugu Desam Party (@JaiTDP) April 14, 2025
సీఎం చంద్రబాబు గారు ఇంటి పెద్దలా తనతో చేసిన ఆత్మీయ సంభాషణతో దళిత యువకుడి జీవితానికి భరోసా దొరికింది.
బైక్ మెకానిక్‌ల సమస్యలు ప్రవీణ్ ద్వారా తెలుసుకున్నారు సీఎం.… pic.twitter.com/Tfj4MDqWJn












Click it and Unblock the Notifications