దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకింది?...సిఎం చంద్రబాబు వ్యాఖ్యలపై కలకలం

By Suvarnaraju
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కర్నూలు:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకిందని మీడియా సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించడం పై దుమారం రేగింది.

  గురువారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఓర్వకల్‌ వద్ద జయరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
  అనంతరం ఏర్పాటు చేసిన పారిశ్రామివేత్తల-మీడియా సమావేశంలో కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలపై తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా స్పందించారు.

  CM Chandrababus intrusive comments in Kurnool tour

  టిడిపి ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమయ్యిందంటూ ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయని ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబును అడగగా...ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు..."ప్రతిపక్షం వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు. చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదా...కేసుల మాఫీ కోసం భారతీయ జనతా పార్టీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు"...అంటూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత మీడియా సమావేశం అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు.

  అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై ఖంగుతిన్న మీడియా ప్రతినిధులు సిఎం వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోలేక గందరగోళంలో పడిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంగా వైసిపిని అభివర్ణించి ఉంటే ఆ పార్టీ ఎప్పుడూ అధికారంలోకి రాలేదు కాబట్టి...ఆ వ్యాఖ్యలు వర్తించే అవకాశం లేదు. పోనీ కాంగ్రెస్ ను ఆయన ప్రతిపక్షంగా భావించి ఉంటే ఆ పార్టీ బిజెపితో కలసి లాలూచీ రాజకీయాలు చేసే అవకాశమే లేదు.

  అయితే మొత్తం మీద చంద్రబాబు బిజెపితో లాలూచీ అనే పదం వాడారు కాబట్టి ఆ వ్యాఖ్యలు వైసిపిని ఉద్దేశించే అన్నారని అర్థం చేసుకోవాలని మీడియా వారు విశ్లేషించుకున్నారు. అయితే వైసిపి అధికారంలో ఉండటం అంటే వైఎస్ జగన్ తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కాబట్టి ఆయన అధికారంలో ఉన్న సమయమని అర్థం చేసుకోవాలేమో నని తమలో తాము చర్చించుకున్నారు. అయినప్పటికీ ఎంత ఆవేశంలోనైనా మాటలు జాగ్రత్తగా మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కసారిగా అంత ఆగ్రహానికి లోనై ఆ విధంగా మాట్లాడటం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

  English summary
  Chief Minister Chandrababu Naidu made intrusive comments remarks in Kurnool tour. On Thursday he visited the district and laid the foundation stone of Jayaraj Ispat steel plant at vorvakal. After that he spoke to the media.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more