మహిళలకు మరో వరం ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ అభ్యర్థిగా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పథకాల అమల్లో సాధ్యాసాధ్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు. తాజాగా మహిళలకు చంద్రబాబు మరో వరం ప్రకటించారు.

వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణాన్ని వారికి మంజూరు చేయబోతున్నారు. ఆర్థికంగా వారు ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు రూ.1500 రూపాయిలు హామీ ఇవ్వడం జరిగింది. ఈ పథకం అమలుపై కూడా విధివిధానాలు రెడీ చేస్తోంది ప్రభుత్వం. నెలకు రూ.1500 చొప్పున ప్రతి నెలా అందిస్తారా? లేదంటే ఒకేసారి సంవత్సరానికి రూ.18వేలు ఇస్తారా? మొత్తం సొమ్ములను మూడు వాయిదాల్లో చెల్లిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ పథకాన్ని ఆగస్టు 15న మొదలు పెట్టడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.

CM Chandrababu said about Six schemes implementation

అయితే లాంఛనంగా ఆగస్టు 15న మొదలు పెట్టినప్పటికి దీని విధి విధానాలపై ఇంకా కసరత్తు చేయాల్సి ఉండటంతో వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేయలనే ఆలోచన చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీన్ని నెల నెల కాకుండా సంవత్సరానికి మూడు మూడు వాయిదాల్లో చెల్లించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు.

కానీ 2019 నుంచి 24 మధ్యకాలంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను భారీగా అమలు చేయడంతోపాటు వాటికి ప్రాధాన్యతనిస్తూనే ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆడపిల్లలు చదువుకునేందుకు కలలకు రెక్కలు పథకం, తల్లికి వందనం పేరుతో సంవత్సరానికి రూ.15వేల చొప్పున అందిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలి.. అందరూ కష్టపడి పనిచేసుకొని సంపాదించాలని చెప్పే చంద్రబాబు కూడా చివరకు సంక్షేమ పథకాలవైపు మొగ్గుచూపుతున్నారంటే అవి ప్రజల్లో తీసుకువచ్చిన మార్పును అర్థం చేసుకోవాలి. అయితే ఎన్నికల సమయంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.కానీ ఇప్పుడుఒక్కరికే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+