ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు - సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

అకాల వర్షాలతో జరిగిన పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టాల‌ని అధికారుల‌ను సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వడగళ్ల వాన, గాలి బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున వడగళ్లు కురవడంతో రోడ్లన్నీ తెల్లని తివాచీ పరిచినట్లు కనిపించాయి. పెద్దఎత్తున కురిసిన వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. గాలి బీభత్సానికి అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి.

అకాల వర్షాలు..నష్టం..అందించాల్సిన సాయం పై సీఎం జగన్ సమీక్షించారు. అధికారులక కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

CM Jagan Directed officials for Enumeration in crop effected areas with heavy rains

రాష్ట్రంలో కురుస్తున్న‌ అకాల వర్షాలపై ముఖ్య‌మంత్రి జగన్‌ అధికారులతో స‌మీక్ష నిర్వ‌హించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టాల‌ని అధికారుల‌ను సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.

వారం రోజుల్లో ఈ ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లుకు ఆదేశాలు జారీచేయాలన్నారు. ఎన్యుమరేషన్‌ పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. భారీవర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు.

CM Jagan Directed officials for Enumeration in crop effected areas with heavy rains

ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం జ‌గ‌న్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని నెల్లూరు..విశాఖ..కడప..కర్నూలు..అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. కడపజిల్లాలోని పులివెందుల, ఆళ్లగడ్డలో మామిడి పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి.

పుట్టపర్తిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. నంద్యాలజిల్లాలో పలుచోట్ల వడగళ్లవాన కురిసింది. బనగానపల్లె, కోవెలకుంట్ల మండలాల్లోని వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ రోజు, రేపు (సోమవారం) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+