ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయండి - సీఎం జగన్ ఆదేశం..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష చేసారు. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళా శిశుసంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీచేయాలని సూచించారు. అంగన్‌వాడీలలో నాడు - నేడు పనులపై సీఎం ఆరా తీసారు. ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
ముఖ్యమంత్రి జగన్ సంపూర్ణపోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలని సూచించారు. అంగన్ వాడీలపై సమీక్షలో భాగంగా ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10వేలకుపైగా అంగన్‌వాడీల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన సుమారు 45వేల అంగన్‌వాడీలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలని సీఎం సూచించారు. అంగన్‌వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలని నిర్దేశించారు. ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు ఇలాంటి సౌకర్యాలపై సమాచారం తెప్పించుకోవాలన్నారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్‌వాడీల్లో ఉంచుకోవాలని నిర్దేశించారు.

గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్‌మెంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీచేయాలని సీఎం ఆదేశించారు. మహిళా శిశుసంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. సంపూర్ణపోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలన్నారు. క్రమం తప్పకుండా అంగన్‌వాడీలపై పర్యవేక్షణ జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ సెంటర్లను పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీల్లో సూపర్ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని సీఎం నిర్దేశించారు.












Click it and Unblock the Notifications