రాంగోపాల్ వర్మ "వ్యూహం" నిర్మాతకు సీఎం జగన్ కీలక పదవి..!!

ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డులో ఖాళీ అయిన స్థానం భర్తీ చేసారు. కొద్ది రోజుల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మీనారాయణ పైన కేసు నమోదు - అరెస్ట్ కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేసారు. ప్రభుత్వం ఈ రాజీనామాను వెంటనే ఆమోదించింది. ఇప్పుడు ఆ స్థానంలో సినీ నిర్మాతగా ఉన్న దాసరి కిరణ్ కుమార్ ను నియమించారు. దాసరి కిరణ్ కుమార్ ఆర్జీవి దర్శకత్వంలో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు సీఎం జగన్ బయోపిక్ గా ఆర్జీవి సిద్దం చేస్తున్న వ్యూహం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా దాసరి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యుల్లో ఆయన ఒకరిగా ఉంటారు. తొలి నుంచి కాంగ్రెస్..ఆ తరువాత వైసీపీలో కిరణ్ యాక్టివ్ గా ఉంటున్నారు. తొలి నుంచి ప్రస్తుత మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి సన్నిహితంగా ఉంటున్నారు.

సినీ రంగంలోనూ పలు సినిమాలను కిరణ్ కుమార్ నిర్మించారు. అందులో ఆర్జీవితో నిర్మించినవే ఎక్కువగా ఉన్నాయి. జీనిఎస్, రామలీల, వంగవీటి, సిద్దార్ధ లాంటి సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాజకీయ లైఫ్ కు సంబంధించి వ్యూహం సినిమా సిద్దం అవుతోంది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడు రాం గోపాల్ వర్మ తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసారు.

CM Jagan gift to RGV producer, appoints Dasari Kiran as TTD board member

ఈ సినిమాలో జగన్ కు సంబంధించి 2009 -2019 మధ్య కాలంలో అంటే..వైఎస్సార్ మరణం నుంచి 2019లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం వరకు సినిమాగా తెరకెక్కించనున్నారు. రియల్ హీరోగా ఏ విధంగా పరిస్థితులను ఎదుర్కొన్నారు..ప్రత్యర్ధుల వ్యూహాలను ఎలా తిప్పి కొట్టారనేది ఈ సినిమాకు ప్రధానమని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల వేళ రెండు పార్టులుగా ఈ సినిమా విడుదల కానుంది.

ఇక, ఈ తనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు కిరణ్ కుమార్ సీఎం జగన్, ఎంపీ బాలశౌరి, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. తాను జగన్ కు ఎప్పటికీ విధేయుడినని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత 19గా ఉన్న టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 24కి పెంచింది. 2021లో దాసరి కిరణ్ టీటీడీ ప్రత్యేక ఆహ్వనితుడుగా ప్రభుత్వం నియమించింది. అయితే, న్యాయ వివాదాలతో ఆ నియామకాలు రద్దయ్యాయి. ఇప్పుడు పూర్తి స్థాయి సభ్యుడిగా నియమితులయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+