Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్ మంచి మనసు.. గుండె తరలింపు కోసం హెలికాప్టర్!!

వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు తన మంచి మనసును, ఉదారతను చాటుకున్నారు. గుండె తరలింపు కోసం సీఎం ఏకంగా తన హెలికాప్టర్ ను ఏర్పాటుచేసి మానవత్వాన్ని చాటారు. తాను మరణిస్తూ మరో ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపిన యువకుడి గుండెను తరలించడానికి తాను ఉపయోగించే హెలికాప్టర్ ను ఏర్పాటు చేశారు. దీంతో గుంటూరు నుంచి గుండె సమయానికి తిరుపతికి చేరుకుంది.

తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స కొనసాగుతోంది. రోడ్డు మార్గం ద్వారా గుండెను తరలిస్తే సమయం వృధా అవుతుందని భావించిన సీఎం, హెలికాప్టర్ ద్వారా గుండెను తరలించేందుకు ఏర్పాటు చేయడం పట్ల ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతుంది. ఆయన మానవతా హృదయంతో స్పందించిన తీరును పలువురు కొనియాడుతున్నారు.

CM Jagan showed a good heart.. Helicopter for heart transplant!!

చిలకలూరిపేట పట్టణంలోని శాంతినగర్ లో నివాసం ఉండే కట్టా రాజు, మల్లీశ్వరి దంపతుల ముగ్గురు కొడుకులలో పెద్దవాడైన కృష్ణ నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు కృష్ణతో పాటు మరికొంతమంది విద్యార్థుల పైకి దూసుకు వెళ్లడంతో కృష్ణ తలకు తీవ్ర గాయమై కృష్ణ బ్రెయిన్ డెడ్ అయ్యాడు.

నిరుపేద తల్లిదండ్రులు రెండు లక్షలకు పైగా ఖర్చు చేసి కొడుకును బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పుట్టెడు దుఃఖంలో ఆ నిరుపేద కుటుంబం బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణ అవయవాలను దానం చేసి ఇతరులకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

CM Jagan showed a good heart.. Helicopter for heart transplant!!

ఈ క్రమంలోనే కృష్ణకు చెందిన లివర్, రెండు కిడ్నీలు, గుండెను వేరు చేసి వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. రమేష్ హాస్పిటల్ నుండి అవయవాలను తరలించడం కోసం పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఇక గుండెను తరలించడం కోసం సీఎం హెలికాప్టర్ ను ఏర్పాటుచేసి సీఎం జగన్ మరో మారు తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+