Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ రాజకీయాలు, జగన్ గెలుస్తాడన్న కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి పీక్స్ కు చేరుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు మాటల తూటాలను ఎక్కు పెడుతూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక ఇదే సమయంలో జగన్ గెలుస్తున్నాడు అని, కూటమి ఓటమి పాలవుతుందని పదే పదే టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్ మరియు కేటీఆర్ లు .

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
అయితే కేసీఆర్, కేటీఆర్ ఏపీ రాజకీయాల విషయంలో స్పందించటం వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలతో పాటు, దేశ రాజకీయాల విషయంలో కూడా ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

CM Revanth Reddy said about AP politics and KCR comments that Jagan will win

చంద్రబాబుపై కేసీఆర్ కు అసూయ, ద్వేషం
ఏపీ రాజకీయాల గురించి మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పై ఉండే అసూయ, ద్వేషం కారణంగానే కెసిఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని, అక్కడ జగనే గెలుస్తాడని చెబుతున్నారని అన్నారు. మొదటి నుంచి కేసీఆర్ కు జగన్ కు మధ్య ఒక అవగాహన ఉందని, చంద్రబాబు అరెస్ట్ ను కూడా కేసీఆర్ అందుకే సమర్థించారని వారిద్దరూ ఒక్కటేనంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో మా ప్లాన్ ఇదే
ఇక ఏపీలో ఎన్నికల ఫలితాల పైన మీ అంచనా ఏమిటి అని అడిగిన ప్రశ్నకు ఏపీలో కాంగ్రెస్ షర్మిల అధ్యక్షతన ఇన్నింగ్స్ ప్రారంభించిందని, ఎన్ని సీట్లు గెలుచుకోగలమన్నది ప్రస్తుతం మా ముందున్న టార్గెట్ అన్నారు. ఏపీలో ప్రశ్నించే గొంతుకగా షర్మిల కొట్లాడుతున్నారు అని, ఆమెకు ఏ విధంగా అండగా ఉండగలం అన్నది ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలన్నదే మా ప్రణాళిక అన్నారు.

షర్మిల చీరపై జగన్ వ్యాఖ్యలపై రేవంత్
కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఎన్నికల వాతావరణ సూచించడం పైనే తాము దృష్టి సారించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల చీరపై చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని, సొంత చెల్లెల్ని కాదు ఏ ఆడపిల్లను కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయకూడదని, ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు రేవంత్ రెడ్డి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+