మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఓటమికి అతనొక్కడే కారణం?

తాజాగా వెల్లడవుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అద్భుత విజయం దిశగా ముందుకు సాగుతోంది. జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్ చేసేసింది. వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. కేవలం 12 స్థానాలకు పరిమితమైంది (ఫలితాలు వెల్లడయ్యేవరకు). తెలుగుదేశం పార్టీ 134, జనసేన 20, బీజేపీ 7 స్థానాలతో ముందంజలో ఉన్నాయి. గత ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ ఐదు సంవత్సరాలు పూర్తయ్యేసరికి అదేస్థాయిలో పరాభవాన్ని మూటకట్టుకుంది. దీనికి కారణం కేవలం వైఎస్ జగన్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజధాని లేకుండా చేయడం
ప్రజావేదిక కూలగొట్టడంతో తన విధ్వంసాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్ ప్రభుత్వ సలహాదారులను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఎవరి సలహాలను స్వీకరించలేదు. తన నిర్ణయాలు తానే తీసుకున్నారు.. ముఖ్యమంత్రి హోదాలో అమలు పరిచేలా చూశారు. అందుకు అన్ని వ్యవస్థలను ఉపయోగించుకున్నారు. రాష్ట్రానికి కీలకమైన వ్యవస్థ అయిన రాజధానిని నిర్మించకుండా మూడు రాజధానులంటూ దక్షిణాఫ్రికా మోడల్ ను చెప్పి ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేశారు. ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి రైతులను ఒక్కసారి కూడా కలవకుండా అహంకారపూరితంగా వ్యవహరించారనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.

cm ys Jagan is the main reason for ex cm ys jaganmohareddy defeat

ఆశలు, ఆకాంక్షలు ఆవిరి
పోలీసు వ్యవస్థను ప్రతిపక్షాలను వేధించేందుకు, తనకు ఇష్టంలేనివారిపై కేసులు పెట్టేందుకు, చివరకు వాట్సాప్ లో చిన్న మెసేజ్ పెట్టుకున్న ప్రజలను కూడా అరెస్ట్ చేయించి భయపెట్టించేందుకు వెనకాడలేదు. ప్రజాస్వామ్యంలో ఆ భయమే ఓటమికి దారితీసేలా చేసింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలు తమ ఆశలను, ఆకాంక్షలను చిదిమేసిన వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఓటును ఈవీఎంలో బలంగా నొక్కారు. అప్పటికప్పుడు తయారై ప్రాణాలను హరించే నాసిరకం మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలద్వారా అమ్మించడం, డిజిటల్ యుగంలో కూడా చేతికి డబ్బులే తీసుకోవడం, ఇసుక దోపిడీ, మంత్రులు, ఎమ్మెల్యేల నోటి వాచాలత్వం, చంద్రబాబుతో సహా ప్రతిపక్ష నేతలను కేసుల పేరుతో అరెస్ట్ చేయించడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రాష్ట్రానికి హోదా కానీ, ప్రత్యేక నిధులను కానీ తీసుకురాకుండా కేంద్రంతో తన కేసుల విషయంలో లాలూచీ పడటంలాంటి కారణాలెన్నో స్వయంక‌ృతాపరాధంగా మారాయి. ఇలా.. ఎన్నో కారణాలే చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాస్తా మాజీ ముఖ్యమంత్రిని చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+