ఏపీలో మరో ఉచితం: జగన్ రివ్యూ- ఆదేశాలు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ఈ నెల 30వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలోని పేదలందరికీ కుటుంబ సంక్షేమం, ఆరోగ్య భరోసా కల్పించడంలో భాగంగా ఈ పథకాన్ని చేపట్టనుంది.

వార్డు/గ్రామ వలంటీర్లు, ఎఎన్ఎంలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్తారు. ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తిస్తారు. ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్న వారి కోసం గ్రామాలు, వార్డుల్లోనే హెల్త్ క్యాంపులను నిర్వహిస్తారు. వైద్య సేవలను అందిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యానికి గురైన వారికి ఆసుపత్రులకూ సిఫార్సు చేస్తారు.

CM YS Jagan

ఈ వైద్య శిబిరాలన్నీ కూడా ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, సంబంధిత మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు పర్యవేక్షణలో కొనసాగుతాయి. రోగులకు అక్కడికక్కడే చికిత్స అందిస్తారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నుంచి ఒక స్పెషలిస్టు డాక్టర్‌ సైతం ఈ హెల్త్ క్యాంప్‌లకు హాజరవుతారు.

వైద్య శిబిరం వద్ద 105 రకాల మందులు, అన్ని రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంచడానికి జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రజల ఆరోగ్య సమస్యల గురించి తెలుసు కోవడానికి ఈ నెల 15 వ తేదీ నుంచి వలంటీర్లు, 16వ తేదీ నుంచి ఎఎన్‌ఎంలు తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది.

ఈ పథకంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే బ్రోచర్‌ను విడుదల చేశారు. జగనన్న సురక్ష తరహాలోనే ఈ ఆరోగ్య సురక్షని కూడా చేపట్టాలని ఆదేశించారు. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.

హెల్త్‌ క్యాంపుల్లో వైద్య పరీక్షలు చేయడంతో పాటు, మందులు, కళ్లద్దాలను సైతం అప్పటికప్పుడు వారికి అందజేయాలని జగన్ ఆదేశించారు. గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, దాన్ని మ్యాపింగ్‌ చేసి, ఆ గ్రామంలో ఏ సమస్యలున్నాయన్నది తెలుసుకుని ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్‌ ద్వారా వాటిని పరిష్కరించాల‌ని చెప్పారు.

ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరికి ఎలాంటి వైద్య పరీక్షలు/చికిత్సను అందజేయాలి?, ఎలాంటి మందులు కావాలనేది తెలుసుకోవాలని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జగన్ పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించడం తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+