TTD: తిరుపతి ఆఫీసులో ఫైల్స్ కాల్చేశారా ?, ఎప్పటి నుంచి ఫైలింగ్ జరిగింది
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంటే ప్రపంచ ప్రసిద్ది చెందిన దేవాలయం అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. తిరుపతి నగరంలో టీటీడీ పరిపాలనా భవనం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో కార్యాలయం కూడా ఉంది. తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం కార్యాలయానికి భారీ బందోబస్తు కూడా ఉంది. శనివారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి.
టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని ఫైల్స్ ఖాళి దగ్ధమయ్యాయని సమాచారం. టీటీడీ పరిధిలోని 13 ఆలయాలకు సంబంధించిన ఫైల్ ఈ అగ్నిప్రమాదంలో దగ్ధమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. సమాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కు ఆదేశాలు జారీ చేశారు.

తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జాయింట్ కలెక్టర్ నిషాంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ నిషాంత్ రెడ్డి సంఘటనా స్థలంలో పరిశీలించి టీటీడీ అధికారులు, సిబ్బంది నుంచి సమాచారం సేకరించి జిల్లా యంత్రాంగాణికి ప్రాథమిక నివేదిక అందించారు.
టీటీడీ పరిపాలనా భవనంలో పాక్షికంగా దగ్దం అయిన ఫైల్స్ ఎప్పటికి, ఎప్పటి నుంచి ఆ ఫైలింగ్ జరుగుతోంది, ఏఏ ఆలయాలకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి అని ఆరా తీస్తున్నారు. తిరుపతి జిల్లా ఎస్సీ సుబ్బారాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. సుమారు 25 ఫైల్స్ దగ్దం అయ్యాయని, ఆ పూర్తి సమాచారం సేకరిస్తున్నామని, త్వరలో పూర్తి సమాచారం అందిస్తామని జిల్లా ఎస్సీ సుబ్బారాయుడు అన్నారు.
ఈ అగ్నిప్రమాదంపై మొదట టీటీడీ పరిపాలనా భవనం ఉద్యోగి నాగార్జున పై అధికారులకు సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే లోపు మంటలు అదుపులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. టీటీడీ పరిపాలనా విభాగం కార్యాలయం అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో తిరుపతిలోని అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. టీటీడీ పరిపాలనా విభాగం భవనంలో అగ్నిప్రమాదం కేసును పలు కోణాలలో అలిపిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications