ఆగస్టులో బెజవాడ జంక్షన్లోకి రాకుండా దారి మళ్ళించే రైళ్ళ పూర్తి జాబితా!!
విజయవాడ డివిజన్ మీదుగా విజయవాడ న్యూ వెస్ట్ బ్లాక్ హట్ మధ్య మూడవ లైన్ కమిషన్ కోసం నాన్ ఇంటర్ లాకింగ్, ప్రీ నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల కారణంగా విజయవాడ జంక్షన్ మీదుగా నడిచే రైళ్లను దారి మళ్ళిస్తున్నారు. దీంతో వారం రోజుల పాటు విజయవాడ జంక్షన్ కు రాకుండానే కొన్ని రైళ్లు ప్రయాణం సాగించనున్నాయి. మరి వాటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
విజయవాడలో రైళ్ళ దారి మళ్లింపు
రైళ్ల దారి మళ్లింపులో భాగంగా రాయనపాడు-గుడివాడ- నిడదవోలు, విజయవాడ బైపాసింగ్ చేయడం ద్వారా రామవరప్పాడు వద్ద రైళ్ళను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఇక విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెంలలో స్టాప్ పేజ్ లను తొలగించారు.విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ 12727రైలు, ఇక హైదరాబాద్ విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ 12728రైలు ఆగస్టు 3వ తేదీనుంచి ఆగస్టు 11వ తేదీవరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది రాయనపాడు రామవరప్పాడు మీదుగా నడుస్తుంది.

కోణార్క్ దారి మళ్లింపు
సిఎస్టి ముంబై నుంచి బయలుదేరే సిఎస్టి ముంబై భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్ 11019 రైలు ఆగస్టు రెండవ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు దారి మళ్లించిన మార్గంలో కొనసాగుతుంది. ఇక భువనేశ్వర్ లో బయలుదేరే భువనేశ్వర్ సిఎస్టి ముంబై కోణార్క్ ఎక్స్ప్రెస్ 11020 రైలు ఆగస్టు 2వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు మళ్లించిన మార్గంలోనే నడుస్తుంది.
స్వర్ణ జయంతి దారి మళ్లింపు
నిజాముద్దీన్ నుండి బయలుదేరే నిజాముద్దీన్ విశాఖపట్నం స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ 12804 రైలు ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఇక విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం నిజాముద్దీన్ స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ 12803 రైలు ఆగస్టు 5 నుండి ఆగస్టు 9 వరకు దారి మళ్ళించిన మార్గంలో నడుస్తుంది.
ఈస్ట్ కోస్ట్ దారి మళ్లింపు
షాలిమార్ నుంచి బయలుదేరే షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 18045రైలు ఆగస్టు 2నుండి ఆగస్టు 10వరకు దారి మళ్ళించిన మార్గంలో నడిస్తే. హైదరాబాదు నుండి బయలుదేరి హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 18046 రైలు ఆగస్టు 3నుండి ఆగస్టు 11వరకు దారి మళ్ళించిన మార్గంలో నడుస్తుంది. ఇక విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ 18503 రైలు ఆగస్టు 8న దారి మళ్ళించిన మార్గంలో నడుస్తుంది.
టాటా యశ్వంతాపూర్ ఎక్స్ ప్రెస్ దారి మళ్లింపు
టాటా నుండి బయలుదేరే 18111 నెంబర్ గల టాటా -యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ ఆగస్టు 8వ తేదీన దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఇక యశ్వంతపూర్ లో బయలుదేరే యశ్వంతపూర్ టాటా ఎక్స్ప్రెస్ 18112 ఆగస్టు 4వ తేదీన దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
ఏపీ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు
విశాఖపట్నం నుండి న్యూఢిల్లీ కి వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ 20805, న్యూఢిల్లీ నుండి విశాఖపట్నం కి వచ్చే ఏపీ ఎక్స్ప్రెస్ 20806 ఆగస్టు రెండవ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు మళ్లించిన మార్గంలో నడుస్తాయి. రామవరప్పాడు రాయనపాడు మీదుగా రైళ్ల మళ్లింపు నేపథ్యంలో రామవరప్పాడు వద్ద తాత్కాలికంగా రైళ్లు ఆగుతాయి.
ఎల్టిటి ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు
ఇక విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం ఎల్టిటి ఎక్స్ప్రెస్ 18519, ఎల్టిటి నుండి బయలుదేరే ఎల్టిటి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 18520 ఆగస్టు రెండవ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు మళ్లించిన మార్గంలో నడుస్తాయి. ఇవి బైపాసింగ్ రాయనపాడు వద్ద తాత్కాలికంగా నిలుస్తాయి.
గరీబ్ రథ్, గాంధీ ధామ్ దారి మళ్లింపు
ఇక విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ 12739, సికింద్రాబాద్-విశాఖపట్నం బయలుదేరే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ 12740 ఆగస్టు 2తేదీనుంచి 10వ తేదీవరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయి. విశాఖపట్నం నుంచి విశాఖపట్నం గాంధీధామ్ ఎక్స్ప్రెస్ 20803 ఆగస్టు 8న దారి మళ్ళించే మార్గంలో నడిస్తే, గాంధీధామ్ నుండి బయలుదేరే గాంధీ ధామ్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 20804 ఆగస్టు 4న దారి మళ్ళించే మార్గంలో నడుస్తుంది.
పూరి ఓఖా ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు
ఇక పూరి నుండి బయలుదేరే పూరి ఓఖా ఎక్స్ప్రెస్ 20819 ఆగస్టు 5వ తేదీన దారిమల్లించిన మార్గంలో నడిస్తే, ఒక నుండి బయలుదేరే ఓఖా- పూరీ ఎక్స్ప్రెస్ 20820 ఆగస్టు 7న దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. రైలు ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తదనగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications