కడప గడ్డ పై షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ కొత్త టాస్క్..!!

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. వైఎస్పార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ పదవితో పాటుగా రాజ్యసభ పైన ఆ పార్టీ అగ్రనాయకత్వం హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు రాజ్యసభ రేసులో షర్మిల పేరు లేదని పార్టీ నేతల సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు షర్మిల అవకాశం కోరినా దక్కలేదు. ఇప్పుడు రాజ్యసభకు ఛాన్స్ ఇవ్వేదు. కొత్తగా ఏపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో తన పార్టీకి షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేసే సమయంలో పలు చర్చలు జరిగాయి. తనతో పాటుగా తనను నమ్ముకున్న వారికి ప్రాధాన్యత పైన చర్చించారు. ఆ సమయంలో షర్మిలకు రాజ్యసభ సీటుతో పాటుగా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ పీసీసీ చీఫ్ పదవి ప్రకటించారు. షర్మిల తన బాధ్యతల నిర్వహణలో భాగంగా ఏపీ రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్నారు. సీఎం జగన్ పైన నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో షర్మిలకు పార్టీ నుంచి రాజ్యసభ సీటు ఖాయంగా దక్కుతుందని పార్టీలో ప్రచారం జరిగింది. రేపటితో ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల సమయం పూర్తి కానుంది. తెలంగాణ నుంచి రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది.

Congress ignores YS Sharmila to nominate for Rajyasbaha in present Elections as reports

ఈ సమయంలో ప్రస్తుత రాజ్యసభ అభ్యర్దుల జాబితాలో షర్మిల పేరు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలించటం లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇదే సమయంలో షర్మిలకు కాంగ్రెస్ నాయకత్వం కొత్త టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షర్మిలను వచ్చే ఎన్నికల్లో ఏపీ నంచి పార్లమెంట్ కు పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. కడప ఎంపీగా బరిలో ఉండాలని పార్టీ చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీ కంటే అసెంబ్లీకి పోటీ చేయిస్తే సభలో పార్టీ వాయిస్ ఉంటుందనే వాదన కొందరు నేతలు పార్టీ ముందు ఉంచారు. దీంతో, నిర్ణయం షర్మిలకు వదిలేసినట్లు తెలుస్తోంది. కుమారుడు వివాహం, ఈ నెల 24 హైదరాబాద్ లో రిసిప్షెన్ తరువాత షర్మిల తిరిగి రాజకీయంగా యాక్టివ్ కానున్నారు. పోటీ పైన షర్మిల ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఏపీలో ప్రత్యక్ష ఎన్నికల్లొ పోటీ చేసేందుకు షర్మిల కూడా సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. కడప జిల్లా నుంచే పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే, వైఎస్ కుటుంబం నుంచి ఈ సారి ఎవరెవరు పోటీలో ఉంటారనే అంశం పైన రాజకీయంగా చర్చ మొదలైంది. ఇప్పుడు షర్మిల నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+